logo

కేంద్ర.. రాష్ట్ర పథకాల అమలుకు కృషి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తోన్న పథకాలను ప్రజలకు చేరువ చేయడానికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని కాకినాడ ఎంపీ వంగా గీత కోరారు. కాకినాడలోని జిల్లా పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం.

Published : 01 Oct 2022 05:20 IST


వేదికపై  కలెక్టర్‌ కృతికాశుక్లా, ఎంపీ గీత, రాజ్యసభ సభ్యుడు సుభాష్‌చంద్రబోస్‌, జడ్పీ ఛైర్మన్‌ వేణుగోపాలరావు

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తోన్న పథకాలను ప్రజలకు చేరువ చేయడానికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని కాకినాడ ఎంపీ వంగా గీత కోరారు. కాకినాడలోని జిల్లా పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం ఉమ్మడి జిల్లా అభివృద్ధి, సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశాన్ని ఎంపీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, జడ్పీ ఛైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు, కలెక్టర్‌ కృతికాశుక్లా, ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాల అమలు తీరు, పురోగతిని సమీక్షించేందుకు ఈ సమావేశం దోహదపడుతుందన్నారు. పాఠశాలలు, ఆస్పపత్రుల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని వివరించారు. కాకినాడ జిల్లాలో జల జీవన్‌ మిషన్‌ పథకం కింద 565 ఆవాసాల్లో శత శాతం ఇంటింటా తాగునీటి కొళాయిలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ పథకం కింద రూ.245 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. రైతులకు ఈక్రాప్‌ బుకింగ్‌ నిర్వహిస్తున్నామని తెలిపారు. కలెక్టర్‌ కృతికాశుక్లా మాట్లాడుతూ గ్రామాల్లో తలపెట్టిన సచివాలయాలు, ఆర్బీకే, వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌ భవనాలను త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలపై సమీక్ష చేశారు. ఈ  కార్యక్రమంలో జడ్పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ, డ్వామా పీడీ అడపా వెంకటలక్ష్మి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ ఎం.శ్రీనివాస్‌, ఐసీడీఎస్‌ పీడీ కె.ప్రవీణ, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ ఎం.శ్రీనివాసరావు, ఏపీ ఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ టీవీఎస్‌ఎన్‌ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని