logo

నిబద్ధతతో విధులు నిర్వర్తించాలి

వన సంరక్షణలో అటవీ శాఖ ఉద్యోగులు నిబద్ధతతో వ్యవహరించాలని, అవకతవకలకు అవకాశం ఇవ్వవద్దని రాష్ట్ర ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి, (అటవీ దళాధిపతి, పీసీసీఎఫ్‌) వై.మధుసూదనరెడ్డి హితవు పలికారు.

Published : 01 Oct 2022 05:20 IST


సూచనలు చేస్తున్న మధుసూదనరెడ్డి

రాజానగరం: వన సంరక్షణలో అటవీ శాఖ ఉద్యోగులు నిబద్ధతతో వ్యవహరించాలని, అవకతవకలకు అవకాశం ఇవ్వవద్దని రాష్ట్ర ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి, (అటవీ దళాధిపతి, పీసీసీఎఫ్‌) వై.మధుసూదనరెడ్డి హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫారెస్ట్‌ అకాడమీలో ఆరు నెలలు శిక్షణ పూర్తి చేసుకున్న సెక్షన్‌ అధికారులు, ఫారెస్ట్‌ బీట్‌ అధికారుల స్నాతకోత్సవం శుక్రవారం దివాన్‌చెరువు రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిధిలోని అకాడమీ ప్రాంగణంలో నిర్వహించారు. ఎఫ్‌ఎస్‌ఓ, ఎఫ్‌బీఓ ట్రయినీలకు బోధిస్తున్న సుమారు 17 అంశాలను సమీక్షించనున్నట్లు చెప్పారు. అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌ ఎంవీ ప్రసాదరావు సభకు స్వాగతం పలకగా, కోర్సు డైరెక్టర్లు వి.ప్రభాకరరావు, టి.చక్రపాణి నివేదిక సమర్పించారు. రాష్ట్ర ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి ఏకే ఝా, రాజమహేంద్రవరం సర్కిల్‌ అటవీ ముఖ్య అటవీ సంరక్షణాధికారి ఎస్‌.శ్రీశరవణన్‌ మాట్లాడారు. డీఎఫ్‌ఓలు జీజీ నరేంద్రన్‌, రవీంద్ర ధామ, షేక్‌ సలాం, సాయిబాబా, అప్పన్న, హిమశైలజ, ఐకేవీ రాజు, బి.నాగరాజు, డీసీఎఫ్‌ కె.రాజశేఖరరావు, ఏసీఎఫ్‌లు ఎన్‌వీ శివరామప్రసాద్‌, టి.శ్రీనివాసరావు, రమణమూర్తి, సబ్‌ డీఎఫ్‌ఓలు జేపీ సౌజన్య, భరణి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని