logo

రాజమహేంద్రవరంలో భీమ ఆభరణాల షోరూం ప్రారంభం

అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరల్లో బంగారం, వెండి, డైమండ్‌ ఆభరణాలు ఉంచడం అభినందనీయమని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. రాజమహేంద్రవరంలోని గోకవరం బస్టాండు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన భీమ బంగారు ఆభరణాల షోరూంను ప్రారంభించారు.

Updated : 01 Oct 2022 05:44 IST


షోరూం ప్రారంభోత్సవంలో హోంమంత్రి తానేటి వనిత, ఎంపీ భరత్‌రామ్‌, షోరూం ఎండీ విష్ణు శరణ్‌ భట్‌ తదితరులు

కంబాలచెరువు: అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరల్లో బంగారం, వెండి, డైమండ్‌ ఆభరణాలు ఉంచడం అభినందనీయమని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. రాజమహేంద్రవరంలోని గోకవరం బస్టాండు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన భీమ బంగారు ఆభరణాల షోరూంను ఎంపీ భరత్‌రామ్‌తో కలిసి శుక్రవారం ఆమె ప్రారంభించారు. ముందుగా సంస్థ ఎండీ విష్ణు శరణ్‌ భట్‌ మంత్రి, ఎంపీకి స్వాగతం పలికి పుష్పగుచ్ఛాలు అందించారు. అనంతరం మంత్రి, ఎంపీ, సంస్థ ఎండీ, డైరెక్టర్‌ సావిత్రి కృష్ణన్‌, రుడా ఛైర్‌పర్సన్‌ మేడపాటి షర్మిలారెడ్డి తదితరులు జ్యోతి వెలిగించి షోరూం ప్రారంభోత్సవం చేశారు. అనంతరం డైమండ్‌, వెండి, ప్లాటినం విభాగాలను ప్రారంభించి పలు రకాల ఆభరణాలను తిలకించారు. సంస్థ ఎండీ విష్ణు శరణ్‌ భట్‌ మాట్లాడుతూ విస్తృత శ్రేణిలో వెరైటీలు, కొనుగోలు ప్లాన్లు, నాణ్యత కలిగిన ఆభరణాలను అందుబాటులో ఉంచడం తమ ప్రత్యేకత అన్నారు. కార్యక్రమంలో సంస్థ యాజమాన్య ప్రతినిధులు ఆదిశ్రీ ఎస్‌ భట్‌, శిల్ప, రోష్మి, భవ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని