logo

కోరింగ గోదావరిలో వ్యర్థాల తొలగింపు

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి గోదావరిలో పేరుకుపోయిన ఆక్వా, ఇతర వ్యర్థాల పరిశీలనకు అధికారుల బృందం వచ్చింది. కోరంగి అభయారణ్యంలోని కోరంగి ప్రాంతాల్లో పర్యటించారు.

Updated : 01 Oct 2022 05:41 IST


వ్యర్థాలు తీయిస్తున్న అధికారులు

తాళ్లరేవు, న్యూస్‌టుడే: కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి గోదావరిలో పేరుకుపోయిన ఆక్వా, ఇతర వ్యర్థాల పరిశీలనకు అధికారుల బృందం వచ్చింది. కోరంగి అభయారణ్యంలోని కోరంగి ప్రాంతాల్లో పర్యటించారు. గోదావరిలో గుట్టలుగా ఉన్న వ్యర్థాలను కోరంగి పంచాయతీ కార్యదర్శి పి.రామరాజు, కోరింగ అభయారణ్యం వన్యప్రాణి విభాగ రేంజ్‌ ఆఫీసర్‌ వరప్రసాద్‌, జిల్లా కాలుష్య నియంత్రణ మండలి బృందం శుక్రవారం పరిశీలించింది. శుక్రవారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కాలుష్య కోరల్లో కోరింగ కథనానికి అధికారులు స్పందించారు. గోదావరిలో పేరుకుపోయిన వ్యర్థాలను పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు తొలగించి, ఆ ప్రాంతంలో శుభ్రం చేశారు. వారం రోజుల్లో ప్రత్యేక కార్యాచరణ ద్వారా కాలుష్య కారణాలపై అన్వేషిస్తామని అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని