logo

వెంకటబుద్ధ సేవలు ఎనలేనివి

కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి అభివృద్ధికి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటబుద్ధ ఎంతో కృషి చేశారని రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ నరసింహం అన్నారు.

Updated : 01 Oct 2022 05:47 IST


వెంకటబుద్ధకు సన్మాన పత్రాన్ని అందజేస్తున్న ఆర్‌ఎంసీ ప్రిన్సిపల్‌ నరసింహం, ప్రతినిధులు

కాకినాడ(మసీదుసెంటర్‌): కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి అభివృద్ధికి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటబుద్ధ ఎంతో కృషి చేశారని రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ నరసింహం అన్నారు. వెంకటబుద్ధ పదవీ విరమణ సందర్భంగా ఆసుపత్రి మినిస్టీరియల్‌, ఫార్మసీ, పారామెడికల్‌, ఆర్‌ఎంసీ, జీజీహెచ్‌ వైద్యులు, నర్సింగ్‌, శానిటరీ, సెక్యూరిటీ సిబ్బంది ఆధ్వర్యంలో సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు, సంఘాల నేతలు వెంకటబుద్ధ ఆసుపత్రికి అందించిన సేవలను గుర్తుచేశారు. అనంతరం వెంకటబుద్ధ మాట్లాడుతూ దాదాపు 34 ఏళ్ల నుంచి ఆసుపత్రితో తనకు అనుబంధం ఉందన్నారు. తరువాత ఆయనకు సన్మాన పత్రాన్ని ఆర్‌ఎంసీ ప్రిన్సిపల్‌ అందజేశారు. తరువాత వివిధ విభాగాలకు చెందిన వారు సత్కరించారు. 


ఇన్‌ఛార్జిగా హేమలతాదేవి

కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి ఇన్‌ఛార్జి సూపరింటెండెంటుగా డాక్టర్‌ డి.హేమలతాదేవిని నియమిస్తూ శుక్రవారం రాష్ట్ర వైద్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారంతో డాక్టర్‌ వెంకటబుద్ద పదవీకాలం ముగియడంతో ఈమె జీజీహెచ్‌ ఇన్‌ఛార్జి సూపరింటెండెంటుగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఈమె కలెక్టర్‌ కృతికాశుక్లాని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని