logo

డిసెంబరులో గృహ ప్రవేశాలకు ఏర్పాట్లు చేయాలి

జిల్లాలోని జగనన్న కాలనీల్లో డిసెంబరు 21న పెద్ద సంఖ్యలో గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని కలెక్టర్‌ కృతికాశుక్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గృహనిర్మాణ సంస్థ, లే-ఔట్ల ప్రత్యేక అధికారులతో శుక్రవారం ఆమె సమీక్ష నిర్వహించారు.

Published : 01 Oct 2022 05:20 IST

సమీక్షిస్తున్న కలెక్టర్‌ కృతికాశుక్లా, హాజరైన అధికారులు

కాకినాడ కలెక్టరేట్‌: జిల్లాలోని జగనన్న కాలనీల్లో డిసెంబరు 21న పెద్ద సంఖ్యలో గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని కలెక్టర్‌ కృతికాశుక్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గృహనిర్మాణ సంస్థ, లే-ఔట్ల ప్రత్యేక అధికారులతో శుక్రవారం ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని అన్ని లే-ఔట్లలో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. అప్రోచ్‌, అంతర్గత రహదారులు, డ్రైనేజీ, విద్యుత్తు, తాగునీరు, స్వాగత ద్వారాలు త్వరగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డిసెంబరు 21న ఎక్కువ ఇళ్లను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందని, దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో జేసీ ఇలక్కియ, హౌసింగ్‌ పీడీ సుధాకర్‌పట్నాయక్‌, సీపీవో త్రినాథ్‌, డ్వామా పీడీ వెంకటలక్ష్మి, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ శ్రీనివాసరావు, డీఎల్‌డీవోలు ప్రసాదరావు, నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని