logo

‘ఎన్టీఆర్‌ పేరు తొలగింపు తప్పిదం’

ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరు తొలగించడం ఘోర తప్పిదమని మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు పేర్కొన్నారు. విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరు మార్పును నిరసిస్తూ రాజోలులో తెదేపా శ్రేణులు రిలే నిరాహారదీక్ష చేపట్టారు.

Published : 01 Oct 2022 05:20 IST


మాజీమంత్రి గొల్లపల్లి, తెదేపా శ్రేణుల దీక్ష

రాజోలు, న్యూస్‌టుడే: ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరు తొలగించడం ఘోర తప్పిదమని మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు పేర్కొన్నారు. విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరు మార్పును నిరసిస్తూ రాజోలులో తెదేపా శ్రేణులు రిలే నిరాహారదీక్ష చేపట్టారు. తొలుత ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గొల్లపల్లి మాట్లాడుతూ 36ఏళ్ల నుంచి ఉంటున్న పేరు మార్చడం జగన్‌ అసమర్ధ పాలనకు నిదర్శనమన్నారు. సాయంత్రం నియోజకవర్గ పరిశీలకుడు చిటికిన రామ్మోహన్‌రావు చేతుల మీదుగా నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో బిక్కిన వీరాస్వామి, బోనం నాగేశ్వరరావు, మంగెన భూదేవి, ఎంపీపీ కేతా శ్రీనివాస్‌, త్రినాధస్వామి, మోకా పార్వతి, కాండ్రేగుల సత్యనారాయణ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని