logo

భిన్నసంస్కృతులు జాతీయ ఐక్యతకు చిహ్నం

దేశంలో భిన్నమతాలు, సంస్కృతులు, ఆచార సంప్రదాయాలు ఉన్నప్పటికీ మనమంతా భారతీయులమనే భావన పెంపొందించుకుని జాతీయ సమైక్యతకు చిహ్నంగా నిలవాలని ఎన్‌సీసీ గ్రూపు(హెడ్‌ క్వార్టర్, కాకినాడ) క్యాంపు కమాండెంట్, గ్రూపు కమాండర్‌ కల్నల్‌ ఏకే రిషి అన్నారు.

Published : 02 Oct 2022 04:20 IST

క్యాడెట్లనుద్దేశించి మాట్లాడుతున్న కల్నల్‌ రిషి

దివాన్‌చెరువు(రాజానగరం), న్యూస్‌టుడే: దేశంలో భిన్నమతాలు, సంస్కృతులు, ఆచార సంప్రదాయాలు ఉన్నప్పటికీ మనమంతా భారతీయులమనే భావన పెంపొందించుకుని జాతీయ సమైక్యతకు చిహ్నంగా నిలవాలని ఎన్‌సీసీ గ్రూపు(హెడ్‌ క్వార్టర్, కాకినాడ) క్యాంపు కమాండెంట్, గ్రూపు కమాండర్‌ కల్నల్‌ ఏకే రిషి అన్నారు. దివాన్‌చెరువులోని శ్రీప్రకాష్‌ విద్యానికేతన్‌లో జాతీయ స్థాయి ప్రత్యేక జాతీయ సమైక్యత శిబిరం(ఎస్‌ఎన్‌ఐసీ)-2022ను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కశ్మీర్‌ నుంచి కేరళ వరకు అన్ని రాష్ట్రాల నుంచి 300 మంది ఎన్‌సీసీ క్యాడెట్లు ఈ శిబిరానికి హాజరయ్యారన్నారు. ఈ నెల తొమ్మిదో తేదీ వరకు శిబిరం నిర్వహిస్తామన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకుని, గౌరవించుకుని సమిష్టిగా మెలగాలన్నారు. శిక్షణ కాలంలో సాంస్కృతిక ప్రదర్శనలు, అతిథి ఉపన్యాసాలు, రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో విజ్ఞానదాయకమైన ప్రదేశాలను సందర్శించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. అనంతరం క్యాడెట్లు టేబుల్‌ టెన్నిస్, వాలీబాల్‌ పోటీల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కల్నల్‌ దుష్యంత్, విద్యాసంస్థ ప్రిన్సిపల్‌ ఏఎస్‌ఎన్‌ మూర్తి తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని