logo

41 నుంచి 94కు... స్వచ్ఛ సర్వేక్షణ్‌లో దిగజారిన ర్యాంకు

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకులో రాజమహేంద్రవరానికి 94వ ర్యాంకు వచ్చింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి ర్యాంకు స్థాయి తగ్గింది. లక్ష నుంచి 10 లక్షల జనాభా కలిగిన పురపాలికలకు ఈ ర్యాంకులను ప్రకటించారు.

Published : 02 Oct 2022 04:20 IST

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకులో రాజమహేంద్రవరానికి 94వ ర్యాంకు వచ్చింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి ర్యాంకు స్థాయి తగ్గింది. లక్ష నుంచి 10 లక్షల జనాభా కలిగిన పురపాలికలకు ఈ ర్యాంకులను ప్రకటించారు. గత ఏడాది నగరానికి 41వ ర్యాంకు వచ్చింది. అదే 2020లో 51 ర్యాంకు, 2019లో 98వ ర్యాంకు వచ్చింది. ఈ ఏడాది మొత్తం ఏడు వేల మార్కులకు పరిశీలించగా 4,212 మార్కులు వచ్చాయి. పారిశుద్ధ్య నిర్వహణకు మూడు వేల మార్కుల్లో 2053.79 మార్కులు, ప్రజాభిప్రాయ సేకరణకు గాను 2250 మార్కులకు 1558.77 మార్కులు, ఏడీఎఫ్‌కు 600 మార్కులు వచ్చాయి. ఓడీఎఫ్‌ డబుల్‌ ఫ్లస్‌లు నగరానికి ప్రకటించారు. పారిశుద్ధ్య నిర్వహణ, ఇంటింటా చెత్తసేకరణ, పబ్లిక్‌ టాయిలెట్స్, చెత్త నిర్వహణ తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని కేంద్రం ర్యాంకులను ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని