logo

తెలుగు మాధుర్యం వర్ణించలేనిది

ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మాతృభాషపై మమకారాన్ని మరిచిపోరాదని కవి, రచయిత, నటుడు తనికెళ్ల భరణి పేర్కొన్నారు. 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ఆదివారం ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు వర్చువల్‌ విధానంలో సాగింది.

Published : 03 Oct 2022 05:47 IST

గడియార స్తంభం, న్యూస్‌టుడే: ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మాతృభాషపై మమకారాన్ని మరిచిపోరాదని కవి, రచయిత, నటుడు తనికెళ్ల భరణి పేర్కొన్నారు. 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ఆదివారం ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు వర్చువల్‌ విధానంలో సాగింది. భారత దేశం నుంచి అమలాపురానికి చెందిన డాక్టర్‌ ఎస్‌.ఆర్‌.ఎస్‌.కొల్లూరి సారధ్యంలో సభను నిర్వహించారు. ఈ సదస్సులో తెలుగు భాష గొప్పతనం, మాధుర్యం, చరిత్ర వంటి అంశాలపై భరణి మాట్లాడిన తీరు అందరినీ ఆలోచింపజేసింది. తెలుగు సాహిత్యంలో వివిధ ప్రక్రియలను అభ్యాసం చేస్తూ, భాషాభివృద్ధికి ప్రపంచంలో ఉన్న తెలుగు వారు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ సదస్సులో ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, అమెరికా ఖండాల్లోని 50 దేశాల నుంచి ఆరు వేదికల ద్వారా 50 మంది సాహితీ వేత్తలు తమ కవితలు వినిపించి, సాహిత్య క్రియలపై ప్రసంగించారు. వంగూరి ఫౌండేషన్‌ అమెరికా, న్యూజిలాండ్‌ తెలుగు అసోసియేషన్‌, శ్రీసాంస్కృతిక కళాసారథి సింగపూర్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని, అమెరికా నుంచి వంగూరి ఫౌండేషన్‌ అధ్యక్షుడు వంగూరి చిట్టెంరాజు, వంశీ ఆర్ట్‌ థియేటర్స్‌ అధ్యక్షుడు రామరాజు, సింగపూర్‌ నుంచి మంగిపూడి రాధిక, వి.సుబ్బు పాలకుర్తి, దక్షిణాఫ్రికా నుంచి గౌతమ్‌ లింగ వంటి ప్రముఖ రచయితలు పాల్గొన్నారని కొల్లూరి తెలిపారు.

Read latest East godavari News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని