logo

26 నుంచి అన్నవరంలో కార్తికమాస ఉత్సవాలు

ఈ నెల 26 నుంచి నవంబరు 23 వరకు పవిత్ర కార్తికమాసంలో అన్నవరం దేవస్థానంలో పలు ఉత్సవాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని ఆదివారం విడుదల చేశారు.

Published : 03 Oct 2022 05:47 IST

అన్నవరం, న్యూస్‌టుడే: ఈ నెల 26 నుంచి నవంబరు 23 వరకు పవిత్ర కార్తికమాసంలో అన్నవరం దేవస్థానంలో పలు ఉత్సవాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని ఆదివారం విడుదల చేశారు. ఈ నెల 21  నుంచి భక్తులు సత్యదీక్షలు చేపట్టనున్నారు. వారికి దేవస్థానం నుంచి ఏర్పాట్లు చేస్తున్నారు. దీక్షా వస్త్రాలు అందించనున్నారు.

* ఈ నెల 26న అనివేటి మండపంలో ఆకాశ దీపం ప్రారంభిస్తారు.

* నవంబరు 5న క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా ఉదయం 8 గంటలకు గ్రామంలోని సుబ్బరాయపురం నుంచి ‘సత్యజ్యోతి’ ఊరేగింపు ప్రారంభమవుతుంది. రత్నగిరిపై కళామందిరం వద్దకు తీసుకువస్తారు. సాయంత్రం 4 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొండపై నుంచి కొండ దిగువున పంపా సరోవరం వద్దకు తీసుకువచ్చి తులసీదాత్రి పూజ నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు తెప్పోత్సవం ప్రారంభమవుతుంది.

* నవంబరు 7న సాయంత్రం 6.30 గంటలకు కొండ దిగువున పంపా సరోవరం చెంతన పంపాహారతులు ప్రారంభిస్తారు. రాత్రి 7.30 గంటలకు తొలిపావంచాల వద్ద జ్వాలాతోరణం కార్యక్రమం ఉంటుంది.

* నవంబరు 8న కార్తిక పౌర్ణమి సందర్భంగా ఉదయం 6 గంటలకు గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు. 9.30 గంటలకు గిరి ప్రదక్షిణ ముగించనున్నారు. అదే రోజు చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 11 గంటలకు ఆలయ ద్వారాలు మూసివేస్తారు. ఈ నేపథ్యంలో ఉదయం 10.30 గంటలకే వ్రతాలు, ఇతర పూజా కార్యక్రమాలు ముగించనున్నారు. 9వ తేదీ తెల్లవారుజాము నుంచి దర్శనాలు యథావిధిగా ప్రారంభిస్తారు.

* నవంబరు 16న సత్యదీక్ష చేపట్టిన భక్తులచే సాయంత్రం 6 గంటలకు పడి పూజ నిర్వహిస్తారు. 17న ఉదయం దీక్షా విరమణ ఉంటుంది.

* నవంబరు 22న రత్నగిరిపై అనివేటి మండపంలో జ్యోతిర్లింగార్చన ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని