logo

విజయీభవ!

జై అమరావతి నినాదాలతో రైౖతుల మహాపాదయాత్ర మంగళవారం తూర్పుగోదావరి జిల్లా ప్రకాశరావుపాలెం నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. ప్రకాశరావుపాలెం నుంచి యాత్ర రామన్నగూడెం, పెదతాడేపల్లి, తాడేపల్లిగూడెం మీదుగా పెంటపాడు వరకు

Published : 05 Oct 2022 05:23 IST

ఈనాడు డిజిటల్‌, ఏలూరు

పాదయాత్రపై పూలుచల్లుతూ..

జై అమరావతి నినాదాలతో రైౖతుల మహాపాదయాత్ర మంగళవారం తూర్పుగోదావరి జిల్లా ప్రకాశరావుపాలెం నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. ప్రకాశరావుపాలెం నుంచి యాత్ర రామన్నగూడెం, పెదతాడేపల్లి, తాడేపల్లిగూడెం మీదుగా పెంటపాడు వరకు 15 కి.మీ మేర యాత్ర సాగింది. ఉదయం 9 గంటలకు స్వామి రథానికి రైతులు పూజలు చేశారు. గుమ్మడికాయలతో దిష్టితీసి శంఖం పూరించి పాదయాత్రను మొదలుపెట్టారు. యాత్ర ఆసాంతం కోలాహలంగా సాగింది. పెద్దతాడేపల్లి, తాడేపల్లిగూడెంలో పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు. రైతులపై పూలవర్షం కురిపించి హారతులిస్తూ ఆహ్వానించారు. రైతులు, కూలీలు, మహిళలతో పాటు వృద్ధులు, చిన్నారులు, యువకులు ఇలా అన్ని వయసులవారు భారీగా హాజరయ్యారు.  ప్రతి గ్రామంలో అమరావతి రైతులకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తెదేపా, జనసేన, భాజపా, కాంగ్రెస్‌, సీపీఐ తదితర పార్టీలు వారి కార్యకర్తలతో యాత్రలో పాల్గొని సంఘీభావం ప్రకటించాయి.  రాజధాని ఆవశ్యకతను ప్రజలకు తెలిపేందుకు అమరావతి ఐకాస ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. దారిపొడవునా పాదయాత్రికులకు గ్రామస్థులు మజ్జిగ, తాగునీరు సరఫరా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని