logo

గౌతమి పాత వారధి పునఃప్రారంభం నేడు

జొన్నాడ - రావులపాలెం హైవే ట్రాఫిక్‌ కష్టాలకు ఈ దసరాతో తెరపడనుంది. గౌతమి పాత వంతెనపై రాకపోకలు బుధవారం నుంచి పున:ప్రారంభం కానున్నాయని హైవే ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ డి. సురేంద్రనాథ్‌, హైవే ప్రాజెక్ట్‌ మేనేజర్‌ కె.బాలసుబ్రహ్మణ్యం మంగళవారం వెల్లడించారు.

Published : 05 Oct 2022 05:23 IST

సిద్ధమైన వారధి

ఆలమూరు, న్యూస్‌టుడే: జొన్నాడ - రావులపాలెం హైవే ట్రాఫిక్‌ కష్టాలకు ఈ దసరాతో తెరపడనుంది. గౌతమి పాత వంతెనపై రాకపోకలు బుధవారం నుంచి పున:ప్రారంభం కానున్నాయని హైవే ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ డి. సురేంద్రనాథ్‌, హైవే ప్రాజెక్ట్‌ మేనేజర్‌ కె.బాలసుబ్రహ్మణ్యం మంగళవారం వెల్లడించారు. పాత వంతెన మరమ్మతు పనులను గతేడాది ఏప్రిల్‌ చేపట్టారు. ట్రాఫిక్‌ వల్ల పనులకు అంతరాయం ఏర్పడుతున్నందున డిసెంబర్‌ నుంచి పాత వంతెనపై వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపేశారు. అప్పటి నుంచి తూర్పువైపు వారధిపైనే రాకపోకలు కొనసాగుతున్నాయి. ఎట్టకేలకు అధికారులు వాహనాల రాకపోకలను పాత వారధిపై ప్రారంభిస్తామని చెప్పడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని