logo

Chinarajappa: తెదేపా-జనసేన కలయికతో వైకాపాలో వణుకు: చినరాజప్ప

తెదేపా, జనసేన కలయికతో వైకాపా ఎమ్మెల్యేలు, మంత్రుల్లో వణుకు మొదలైందని పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప పేర్కొన్నారు. మండపేట మండలంలో అమరావతి రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలిపిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

Updated : 21 Oct 2022 07:48 IST

పాదయాత్రలో చినరాజప్ప

మండపేట: తెదేపా, జనసేన కలయికతో వైకాపా ఎమ్మెల్యేలు, మంత్రుల్లో వణుకు మొదలైందని పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప పేర్కొన్నారు. మండపేట మండలంలో అమరావతి రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలిపిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. స్వశక్తితో ఎదిగి రాజకీయాల్లోకి వచ్చిన పవన్‌ కల్యాణ్‌ను, నీతి నిజాయతీతో ఉన్న చంద్రబాబును విమర్శిస్తున్న వైకాపా నాయకులు తామేంటో తెలుసుకోవాలన్నారు. ప్యాకేజీలకు, అవినీతికి బ్రాండ్‌ అంబాసిడర్‌ జగన్‌ అని అందరికీ తెలుసనీ.. 11 కేసుల్లో ఏ-1 ముద్దాయిగా ఉండి.. దొరికిన కాడికి దోచుకున్నది జగనే అన్నారు. ఇప్పటికే ప్రజల్లో తిరుగుబాటు మొదలైందనీ.. మొన్న విశాఖలో కొట్టారు... ప్రజల్లో తిరుగుబాటు వచ్చి తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని పేర్కొన్నారు. వైకాపా పాలనలో రాష్ట్రం అప్పులపాలై సర్వ నాశనమై. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఎవరు పోరాడినా కేసులుపెడుతున్న ఈ ప్రభుత్వంపై... కలిసిపోరాడాల్సిన సమయం ఆసన్నమైందనీ..  అన్ని పార్టీలూ ఏకం కావడానికి జగన్‌ వేధింపులే కారణమని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని