logo

కాజ్‌వే పునరుద్ధరణకు రూ.6 లక్షల మంజూరు

 సామర్లకోట మండలం, వెంకటకృష్ణరాయపురం పరిధిలోని కాజ్‌వే పునరుద్ధరణకు రూ.6 లక్షలు మంజూరు చేసినట్లు సంయుక్త కలెక్టర్‌ ఇలక్కియ తెలిపారు.

Published : 28 Nov 2022 05:47 IST

ఈనాడు కథనానికి స్పందన

కాకినాడ కలెక్టరేట్‌:  సామర్లకోట మండలం, వెంకటకృష్ణరాయపురం పరిధిలోని కాజ్‌వే పునరుద్ధరణకు రూ.6 లక్షలు మంజూరు చేసినట్లు సంయుక్త కలెక్టర్‌ ఇలక్కియ తెలిపారు. ఈ నెల 23న ‘ఆవరించిన ముసురు’ శీర్షికతో ‘ఈనాడు’లో ప్రచురించిన కథనానికి జిల్లా యంత్రాంగం స్పందించింది. సుమారు 1,000 ఎకరాల్లో పండిన ధాన్యాన్ని బయటకు తీసుకురావడానికి ఉన్న ఏకైక మార్గం కొట్టుకుపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ మరో ఇరుకు వంతెన ఉన్నప్పటికీ ఆటోలు మాత్రమే వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ధాన్యం తరలింపునకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయాన్ని శనివారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. కాజ్‌వే స్థానంలో శాశ్వత ప్రాతిపదికన వంతెన నిర్మించాలని కోరారు. దీన్ని పరిశీలిస్తామని కలెక్టర్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు