logo

ధాన్యం.. కొంటే జన్మ ధన్యం!

ఖరీఫ్‌ ధాన్యం అమ్ముకోడానికి రైతులు ఆపసోపాలు పడాల్సి వస్తోంది. నిబంధనలు దాటుకుని ఎప్పటికి అమ్ముతామోనన్న ఆందోళన వారిని తొలిచేస్తోంది.

Published : 29 Nov 2022 04:46 IST

పి.గన్నవరం మండలం పోతవరం వద్ద ధాన్యం ఆరబోస్తున్న రైతులు

ఈనాడు, కాకినాడ-న్యూస్‌టుడే, సీతానగరం: ఖరీఫ్‌ ధాన్యం అమ్ముకోడానికి రైతులు ఆపసోపాలు పడాల్సి వస్తోంది. నిబంధనలు దాటుకుని ఎప్పటికి అమ్ముతామోనన్న ఆందోళన వారిని తొలిచేస్తోంది.

కళ్లాలు లేక కన్నీళ్లు: ప్రస్తుతం కళ్లాల్లోంచి ధాన్యం బయటకు తరలించాలంటే వాలంటీరుకు సమాచారం ఇవ్వాలి. చెప్పకుండా తరలిస్తే కొనే పరిస్థితి లేదు. దీంతో చేసేది లేక అక్కడే ధాన్యం రాశులు ఉంచి.. అసౌకర్యాల నడుమ ఆరబెడుతున్నారు. కొందరు రోడ్లను ఆశ్రయిస్తున్నారు.

సంచుల్లేక.. సంకటం: ఆర్‌బీకేల్లోకి కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించే రైతులకు పీఏసీఎస్‌లు గోతాలు సమకూరుస్తున్నాయి. తూగో జిల్లాలో 70 లక్షల సంచులు అవసరమైతే సగం కూడా అందుబాటులో లేని పరిస్థితి. కోనసీమ జిల్లాలో 42 లక్షలకు, ఒకసారి వినియోగించిన సంచులు 2.57 లక్షలు సిద్ధంగా చేశారు. కాకినాడ జిల్లాలో 30 లక్షలు అవసరమైతే.. 10 లక్షలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

దారి.. కూలీ ఖర్చులు: గత సీజన్‌లో హమాలీ, రవాణా ఖర్చులు బకాయిలు ఉండగా.. ఈసారి ఖాతాల్లో వేస్తామని చెబుతున్నారు. దీంతో రైతులు ముందస్తు పెట్టుబడి పెట్టాల్సివస్తోంది. ప్రభుత్వం ఇస్తున్నది చాలడం లేదన్నది వారి వాదన. ఈ ఇబ్బందులు పడలేక కొందరు రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు.


హమాలీ ఖర్చులు ఎప్పుడిస్తారో..?


‘‘గతేడాది ధాన్యం రవాణా సమయంలో హమాలీ ఖర్చులు క్వింటాకు రూ.30 చొప్పున... రూ.25వేలు వరకు రావాలి. రేపు, మాపు అంటున్నారు. ఈ ఏడాది ధాన్యం అమ్మకాలు మొదలయ్యాయి. అసలే నష్టాల్లో ఉన్న రైతులకు కూలీలకు ముందస్తుగా పెట్టుబడి పెట్టడం ఇబ్బందిగా ఉంది. ధాన్యం డబ్బుతోపాటు హమాలీ ఖర్చులు ఖాతాలో వేస్తామని చెబుతున్నా.. వేసే వరకు నమ్మకం కలగదు’’

గద్దే ఉమాశంకర్‌ మహేశ్వరరావు, రైతు, రఘుదేవపురం


సర్దుబాటు చేస్తున్నాం..

ధాన్యం కొనుగోళ్లలో రైతులకు గోనె సంచుల కొరత లేకుండా చూస్తున్నాం. జిల్లాలో 30 లక్షల సంచులు అందుబాటులో ఉన్నాయి. అన్నిచోట్లా కోతలు పూర్తవ్వలేదు కనుక ఈ సంచులు సర్దుబాటు చేస్తున్నాం. ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం.

తనూజ, డీఎం, పౌరసరఫరాల సంస్థ, తూగో జిల్లా

Read latest East godavari News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని