గూడు చుట్టూ చిక్కుముళ్లు
వాలియాతోడి నాగలక్ష్మికి 2020లో బొమ్మూరు టిడ్కో గృహ సముదాయంలో ఇల్లు(ఫ్లాట్) మంజూరు చేశారు. బి-13లో ఫ్లాట్ కేటాయించారు. ఆ ఇంటికి వెళ్లగా నోటీసు బోర్డు అతికించి ఉంది.
బొమ్మూరులో టిడ్కో గృహాలు
వాలియాతోడి నాగలక్ష్మికి 2020లో బొమ్మూరు టిడ్కో గృహ సముదాయంలో ఇల్లు(ఫ్లాట్) మంజూరు చేశారు. బి-13లో ఫ్లాట్ కేటాయించారు. ఆ ఇంటికి వెళ్లగా నోటీసు బోర్డు అతికించి ఉంది. అదే ఇంటిని 2019కు ముందు వేరే వాళ్లకు కేటాయించారు. తర్వాత వైకాపా అధికారంలోకి వచ్చాక వివిధ కారణాలతో తొలి లబ్ధిదారుల జాబితా నుంచి ఆ పేరు తొలగించారు. దీంతో ఆ ఇల్లు నాదేనని జాబితాలో తొలగించిన ఆమె కోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఆ ఇంటిని నాగలక్ష్మికి కేటాయించారు. కోర్టు నోటీసు ఇంటికి అతికించడంతో తాళం వేసి ఉంది. ప్రస్తుతం ఇల్లు లబ్ధిదారు నాగలక్ష్మి మాత్రం రెండేళ్లుగా కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు.
న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ
టిడ్కో ఇళ్లకు సంబందించి చిక్కుముడులు ఇంకా వీడటం లేదు. పేదలకు ఇళ్ల పేరుతో బొమ్మూరు, తొర్రేడులో టిడ్కో గృహ సముదాయాలు నిర్మించారు. మొదటి ఫేజ్‌లో 3,424 మంది లబ్ధిదారులను గుర్తించారు. వారిలో ఇప్పటి వరకు 2,567 మందికి మాత్రమే పట్టా రిజిస్ట్రేషన్లు జరిగాయి. మిగిలిన 857 మంది విషయంలో ఇంకా ఆటంకాలు ఎదురవుతున్నాయి. వీరిలో 175 మందిని గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారు. రెండోసారి చేపట్టిన పరిశీలనలో వివిధ కారణాలతో వారిని పక్కన పెట్టారు. ఆ జాబితాలో కొత్త వారికి అవకాశం కల్పించారు. వీటికి కేటాయించిన ఇళ్లు గతంలో మరొకరికి ఇవ్వడంతో వాటిని స్వాధీనం చేసుకునేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలోని లబ్ధిదారులు కొందరు కోర్టును ఆశ్రయించగా , మరికొందరు పేర్లు తొలగించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత, కొత్త లబ్ధిదారులు ఇద్దరూ కలెక్టర్, నగరపాలక సంస్థ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. రెండో ఫేజ్‌లో బొమ్మూరు, నామవరం, హుకుంపేట, సింహాచల్‌నగర్, వడ్డెర కాలనీలో 6,304 మందికి ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. వీటిలోని లబ్ధిదారుల జాబితాలో చిక్కులు ఏర్పడుతున్నాయి.
అదే పరిస్థితి..
మొదటి ఫేజ్‌లో రిజిస్ట్రేషన్ పూర్తి కాని 857 మందిలో జాబితా నుంచి తొలగించిన 175 మందిని మినహాయిస్తే మిగిలిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. రిజిస్ట్రేషన్ పూర్తి కాని వారిలో మృత్యు చెందిన వారు ఉన్నారు. వారితో పాటు మరికొందరికి రుణాలు మంజూరు కావడం లేదు. సిబిల్ స్కోర్ తక్కువగా ఉండటంతో కొన్ని బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు వెనకడుగు వేస్తున్నాయి. లబ్ధిదారులు గతంలో సెల్‌ఫోన్లు, టీవీలు, వాషింగ్‌మెషిన్లు కొనుగోలుకు చిన్నమొత్తాల్లో రుణం తీసుకున్నారు. వాటిని సరిగా చెల్లించని వారికి సిబిల్ స్కోరు ఆటంకంగా మారుతోంది. మరికొంత మందికి విద్యుత్తు బిల్లు నిబంధనల కంటే ఎక్కువ రావడంతో వారిని పక్కన పెట్టిన పరిస్థితులు ఉన్నాయి.
పరిశీలించి చర్యలు..
జాబితా పరిశీలనలో భాగంగా అనర్హులను పక్కన పెట్టి వారి స్థానంలో కొత్త వారికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. అర్హులైన వారికి ఇళ్లను కేటాయిస్తాం. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఇబ్బందులు అధిగమించేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటాం. కోర్టులో ఉన్న విషయాలు తీర్పును బట్టి పరిష్కరిస్తాం.
మాలిక్, మున్సిపల్ మేనేజరు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
U19W T20 World Cup: అండర్ 19 T20 ప్రపంచకప్ ఫైనల్కు దూసుకెళ్లిన భారత్
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Punjab: ఉచిత వైద్యం.. మరో 400 మొహల్లా క్లీనిక్లు ప్రారంభం
-
Sports News
Sarfaraz: సర్ఫరాజ్ మా దృష్టిలోనే ఉన్నాడు: బీసీసీఐ
-
Movies News
Athiya-Rahul: అతియా - రాహుల్ పెళ్లి.. ఆ వార్తల్లో నిజం లేదు
-
General News
Balakrishna: చికిత్స కోసం తారకరత్నను బెంగళూరు తరలిస్తాం: బాలకృష్ణ