logo

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత అన్నారు.

Published : 29 Nov 2022 04:46 IST

రాయితీ చెక్కుతో హోంమంత్రి వనిత, కలెక్టర్‌ మాధవీలత, రుడా ఛైర్‌పర్సన్‌ షర్మిలారెడ్డి తదితరులు

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం): రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత అన్నారు. పంట నష్టాలపై పెట్టుబడి రాయితీ, రుణాలపై సున్నా వడ్డీ రాయితీ విడుదలకు సంబంధించి సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశమందిరంలో నిర్వహించిన జిల్లాస్థాయి కార్యక్రమంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్‌లోనే పరిహారం చెల్లిస్తామన్న సీఎం మాట ప్రకారం ఈ ఏడాది జులై-అక్టోబరు మధ్య కురిసిన అధిక వర్షాలు, వరదలకు పంట నష్టపోయిన జిల్లాలోని 5,488 మంది రైతులకు పెట్టుబడి రాయితీ ఖరీఫ్‌ ముగియక ముందే నేరుగా వారి ఖాతాలకు జమ చేశారన్నారు. కలెక్టర్‌ మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన పంటలకు సంబంధించి సున్నా వడ్డీ పంట రుణాలుగా 42,595 మంది రైతులకు రూ.8.44 కోట్లు, పంట నష్టంపై పెట్టుబడి రాయితీగా 5,488 మంది రైతులకు రూ.5.35 కోట్లు ముఖ్యమంత్రి నేరుగా అమరావతి నుంచి రైతుల ఖాతాల్లో జమచేశారన్నారు. డీసీసీబీ ఛైర్మన్‌ ఆకుల వీర్రాజు, రుడా ఛైర్‌పర్సన్‌ షర్మిలారెడ్డి, గోపాలపురం ఏఎంసీ ఛైర్మన్‌ జనార్దనరావు, జిల్లా వ్యవసాయాధికారి మాధవరావు, జిల్లా ఉద్యాన అధికారి రాధాకృష్ణ, వ్యవసాయ సలహామండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని