logo

‘గిరిజన తెగలో ఇతర కులాలను చేర్చొద్దు’

బోయ, బెంతు ఒరియా కులాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వం జీవో నంబరు -52 ద్వారా శామ్యూల్‌ ఆనంద్‌ ఏకసభ్య కమిటీ వేయడాన్ని నిరసిస్తూ

Updated : 29 Nov 2022 05:12 IST

కలెక్టరేట్‌ వద్ద నిరసనలో గిరిజన ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు

అమలాపురం(అల్లవరం), న్యూస్‌టుడే: బోయ, బెంతు ఒరియా కులాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వం జీవో నంబరు -52 ద్వారా శామ్యూల్‌ ఆనంద్‌ ఏకసభ్య కమిటీ వేయడాన్ని నిరసిస్తూ గిరిజన ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికే 35 లక్షల జనాభాతో ఎలాంటి అభివృద్ధికి నోచుకోని గిరిజనలు రెక్కాడితేగాని డొక్కాడని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని, బీసీ-ఏలో ఉన్న బోయలను గిరిజన జాబితాలో చేరిస్తే నిజమైన గిరిజనులు రిజర్వేషన్‌, ప్రభుత్వ ఫలాలు కోల్పోయే ప్రమాదం ఉందని వాపోయారు. జీవో నం-52ను వెంటనే రద్దు చేయాలని, లేదంటే వైకాపా ప్రభుత్వానికి గిరిజనులు బుద్ధి చెబుతారన్నారు. అనంతరం జేసీ ధ్యానచంద్రకు వినతి పత్రం అందజేశారు. నేషనల్‌ ట్రైబల్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు మానుపాటి నవీన్‌, కుడుముల రామచంద్రయ్య, చిన వీరోజీ, జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని