logo

యుద్ధప్రాతిపదికన విద్యుత్తు కనెక్షన్లకు ఆదేశం

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని విద్యుత్తు శాఖకు సంబంధించిన వివిధ అంశాలపై ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.విజయానంద్‌ సంస్థ పనితీరు, ప్రగతిపై గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

Updated : 02 Dec 2022 07:06 IST

సమీక్షిస్తున్న విజయానంద్‌, ఇతర డైరెక్టర్లు

దేవీచౌక్‌(రాజమహేంద్రవరం): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని విద్యుత్తు శాఖకు సంబంధించిన వివిధ అంశాలపై ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.విజయానంద్‌ సంస్థ పనితీరు, ప్రగతిపై గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న కాలనీల్లో నిర్మాణమైన ఇళ్లకు యుద్ధ ప్రాతిపదికన విద్యుత్తు కనెక్షన్లు ఇవ్వాలని ఆదేశించారు. వీధి దీపాలు, వాటర్‌ వర్క్స్‌కు త్వరితగతిన విద్యుత్తు సౌకర్యం కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. గడప గడపకు మన ప్రభుత్వంలో విద్యుత్తు సమస్యల వినతులపై తక్షణమే స్పందించాలని స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ విద్యుత్తు సర్వీసులను విడుదల చేయాలని ఆదేశించారు. వ్యవసాయానికి పగటిపూట తొమ్మిది గంటలు, పరిశ్రమలు, గృహ వినియోగదారులకు 24 గంటల విద్యుత్తు సరఫరా అందించాలన్నారు. జిల్లాలో సంస్థ పనితీరు, ప్రగతిపై సర్కిల్‌ ఎస్‌ఈ టీవీఎస్‌ఎన్‌ మూర్తి వివరించారు. సమావేశంలో ఈపీడీసీఎల్‌ డైరెక్టర్లు బి.రమేష్‌ప్రసాద్‌, డి.చంద్రం, సీజీఎం విజయలలిత, జీఎంలు తిలక్‌కుమార్‌, సాల్మన్‌రాజు, ఈఈలు, డీఈఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read latest East godavari News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు