logo

ఎయిడ్స్‌ మహమ్మారిని అంతం చేయాలి

సంకోచాలు వీడి సమష్టిగా ఎయిడ్స్‌ మహమ్మారిని అంతం చేయాలని కలెక్టర్‌ కృతికాశుక్లా పిలుపునిచ్చారు. ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినం సందర్భంగా గురువారం కలెక్టరేట్‌లో ఆమె అధ్యక్షతన ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.

Published : 02 Dec 2022 05:16 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ కృతికాశుక్లా, వేదికపై ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, కుడా ఛైర్‌పర్సన్‌ చంద్రకళాదీప్తి

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: సంకోచాలు వీడి సమష్టిగా ఎయిడ్స్‌ మహమ్మారిని అంతం చేయాలని కలెక్టర్‌ కృతికాశుక్లా పిలుపునిచ్చారు. ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినం సందర్భంగా గురువారం కలెక్టరేట్‌లో ఆమె అధ్యక్షతన ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎయిడ్స్‌ బాధిత చిన్నారులతో కలెక్టర్‌, ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, కుడా ఛైర్‌పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ ప్రఖర్‌జైన్‌, వివిధ కార్పొరేట్‌, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మధ్యాహ్న భోజనం చేశారు. ఓఎన్జీసీ, రిలయన్స్‌, భీమాబాయి మహిళా మండలి సమకూర్చిన పౌష్టికాహార కిట్లను బాధిత చిన్నారులకు అందజేశారు. కళాశాల విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఎయిడ్స్‌ నివారణలో విశేష సేవలందించిన అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను సత్కరించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ, డీఎంహెచ్‌వో ఎం.శాంతిప్రభ పాల్గొన్నారు. కాకినాడకు చెందిన సోల్‌మేట్స్‌ అనే బృందం రూ.1.35 లక్షల చెక్కును కలెక్టర్‌కు అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని