logo

సీఎస్‌ఆర్‌ నిధులపై సమీక్ష

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వివిధ చమురు సంస్థలు కార్పొరేట్‌ సామాజిక బాధ్యతగా చేపడుతున్న అభివృద్ధిపనులపై అమలాపురం ఎంపీ అనురాధ గురువారం మొగళ్లమూరులో సమీక్షించారు.

Published : 02 Dec 2022 05:16 IST

అల్లవరం: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వివిధ చమురు సంస్థలు కార్పొరేట్‌ సామాజిక బాధ్యతగా చేపడుతున్న అభివృద్ధిపనులపై అమలాపురం ఎంపీ అనురాధ గురువారం మొగళ్లమూరులో సమీక్షించారు. ఓఎన్జీసీ, గెయిల్‌, కెయిన్‌ ఎనర్జీ కంపెనీ ప్రతినిధులు, ఆర్‌డబ్ల్యూఎస్‌, పీఆర్‌, ఇతర అధికారులు హాజరయ్యారు. సీఎస్‌ఆర్‌ నిధులు మంజూరుచేసే సమయంలో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ ద్వారా వచ్చిన ప్రతిపాదనలు మాత్రమే పరిగణనలోకి తీసుకుని జిల్లా కలెక్టర్‌ ద్వారా కేటాయింపులు చేయాలన్నారు. చమురు అన్వేషణ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రాంతాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని, దళారులకు చోటులేకుండా చేయాలన్నారు. నిధులు నేరుగా కలెక్టర్‌ ఖాతాకు జమచేస్తే వాటిని పారదర్శకంగా ఖర్చుచేసే వెసులుబాటు ఉంటుందన్నారు. పెట్రోలియం స్టాండింగ్‌ కమిటీ సభ్యురాలిగా సీఎస్‌ఆర్‌ నిధులపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉందన్నారు. అల్లవరం మండలంలో 14 ఓహెచ్‌ఎస్‌ఆర్‌ ట్యాంకులు, పేరూరు వై.జంక్షన్‌ నుంచి గోడిలంక వరకు ర.భ.శాఖ రహదారి ఆధునికీకరణకు రూ.17.5 కోట్లు మంజూరైనట్లు ఎంపీ తెలిపారు. చమురు సంస్థల ప్రతినిధులు మాట్లాడారు. నెడ్‌క్యాప్‌, ఓఎన్జీసీ, గెయిల్‌, కెయిన్‌ ఎనర్జీ సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని