logo

యువతను ఓటర్లుగా నమోదు చేయండి

జిల్లావ్యాప్తంగా 18-19 ఏళ్ల యువతను ఓటర్లుగా నమోదు చేసేలా క్షేత్రస్థాయిలో అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టరు హిమాన్షుశుక్లా ఆదేశించారు.

Published : 02 Dec 2022 05:16 IST

కలెక్టరేట్‌లో సమీక్షిస్తున్న పాల్గొన్న కలెక్టరు హిమాన్షు శుక్లా, జేసీ తదితరులు

అమలాపురం కలెక్టరేట్‌: జిల్లావ్యాప్తంగా 18-19 ఏళ్ల యువతను ఓటర్లుగా నమోదు చేసేలా క్షేత్రస్థాయిలో అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టరు హిమాన్షుశుక్లా ఆదేశించారు. గురువారం భారత ఎన్నికల సంఘం కార్యాలయ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ నితిష్‌వ్యాస్‌, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్‌ మీనా దూరదృశ్య సమీక్ష నిర్వహించారు. జేసీ ధ్యానచంద్ర, డీఆర్వో సత్తిబాబు, జడ్పీ సీఈవో సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


యువతకు ఓటు కల్పించే దిశగా చర్యలు

వి.ఎల్‌.పురం (రాజమహేంద్రవరం): వచ్చే ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన యువత ప్రతిఒక్కరికీ ఓటు హక్కు కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నామని కలెక్టర్‌ మాధవీలత తెలిపారు. జిల్లా జనాభా లెక్కల ప్రకారం 18-19 ఏళ్ల మధ్య వయసున్న యువత 48 వేల మంది ఉండగా వీరిలో 7,800 మంది మాత్రమే ఓటరుగా నమోదైనట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఓటు నమోదు విషయంలో యువతలో అవగాహన పెంచేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బందికి ఇప్పటికే ఆదేశాలిచ్చారు. జిల్లా ఎన్నికల అధికారులతో న్యూదిల్లీ నుంచి సీనియర్‌ డిప్యూటీ ఈసీ నితీష్‌కుమార్‌వ్యాస్‌ దూరదృశ్య సమావేశం ద్వారా ఓటర్ల జాబితా, 18 ఏళ్లు నిండిన ఓటర్ల నమోదు, పోలింగ్‌ కేంద్రాలు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 99.97 శాతం మందికి ఓటర్‌ కార్డులు జారీ చేసినట్లు తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని