logo

ఓటు నమోదు శిబిరాలకు స్పందన

జిల్లాలో కాకినాడ నగరం, గ్రామీణం, పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో శనివారం ప్రత్యేక ఓటు నమోదు శిబిరాలు నిర్వహించారు.

Published : 04 Dec 2022 02:57 IST

నేడూ దరఖాస్తుల స్వీకరణ

కాకినాడ నగర నియోజకవర్గంలో ప్రత్యేక శిబిరాన్ని పరిశీలిస్తున్న ఈఆర్వో రమేశ్‌

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలో కాకినాడ నగరం, గ్రామీణం, పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో శనివారం ప్రత్యేక ఓటు నమోదు శిబిరాలు నిర్వహించారు. ఏడు నియోజకవర్గాల్లోని 1,634 పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బూత్‌స్థాయి అధికారులు 2023, జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారి నుంచి కొత్తగా ఓటు నమోదుకు ఫారం-6 దరఖాస్తులు స్వీకరించారు. ముసాయిదా ఓటర్ల జాబితాను అనుసరించి చేర్పులు, మార్పులు, తొలగింపు, బదిలీకి దరఖాస్తులు తీసుకున్నారు. శనివారం సాయంత్రం 6 గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో 3,156 దరఖాస్తులు స్వీకరించారు. వీటిలో సింహభాగం కొత్తగా ఓటు నమోదుకు వచ్చినవే ఉన్నాయి. గత నెల 9న జిల్లా ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ-2023లో భాగంగా అదే రోజు నుంచి ఈ నెల 8 వరకు ఓటు నమోదుకు అవకాశం కల్పించారు. దీనిలో భాగంగా శని, ఆదివారాలు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశారు. తొలిరోజు శిబిరానికి మంచి స్పందన లభించింది. ఆదివారం కూడా జిల్లాలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు నమోదు, చేర్పులు, మార్పులు, బదిలీ, తొలగింపునకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్లు(ఈఆర్వో) ఈ శిబిరాలను సందర్శించి, బీఎల్వోలకు సూచనలు చేశారు. పలు డిగ్రీ, ఇంజినీరింగ్‌ కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన  సదస్సులు నిర్వహించారు. కాకినాడ నగర నియోజకవర్గంలో ఈఆర్వో, మున్సిపల్‌ కమిషనర్‌ కె.రమేశ్‌ రెండు కళాశాలల్లో విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని