logo

రొయ్య ధరల స్థిరీకరణకు రైతుల డిమాండ్‌

రొయ్యల ధరల స్థిరీకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని ఐ.పోలవరం మండల ఆక్వా రైతులు విజ్ఞప్తి చేశారు.

Published : 05 Dec 2022 06:16 IST

ఐ.పోలవరంలో ఆక్వా రైతుల సంఘీభావం

ఐ.పోలవరం: రొయ్యల ధరల స్థిరీకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని ఐ.పోలవరం మండల ఆక్వా రైతులు విజ్ఞప్తి చేశారు. మేత, ఇతర పెంపకం సామగ్రి ధరలను నియంత్రించకపోతే పంట విరామమే శరణ్యమని హెచ్చరించారు. ఆదివారం నిర్వహించిన సమావేశంలో రైతులు మాట్లాడుతూ రొయ్యల సాగు సంక్షోభంలో కూరుకుపోతోందన్నారు. ప్రభుత్వం విద్యుత్తు రాయితీలిచ్చి ఆదుకోవాలని కోరారు. తాము పండించిన రొయ్యలను మద్దతు ధరకు కొనుగోలుచేయాలన్నారు. అడ్డగోలుగా పెరిగిన మేత, మందుల ధరలు తగ్గించి ఆక్వా పరిశ్రమను కాపాడాలన్నారు. భారత సైన్యానికి రొయ్యలు సరఫరా చేయాలన్నారు. రైతులంతా ఐక్యంగా ఉంటే రొయ్యల ఎగుమతిదారులు దిగివస్తారని, అందుకు ప్రతిరైతు సహకరించాలని సమావేశంలో తీర్మానించారు. సూర్యారావు, పృథ్వీరాజు, సూరిబాబు, సతీష్‌రాజు, శ్రీనురాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు