logo

కృష్ణం వందే జగద్గురుమ్‌

గీతాజయంతిని పురస్కరించుకుని గోపాల్‌నగర్‌ పుంతరోడ్డులోని శ్రీకృష్ణ దేవాలయంలో గోదావరి జలాలతో స్వామివారికి వైభవంగా అభిషేకం నిర్వహించారు.

Published : 05 Dec 2022 06:16 IST

ఆకట్టుకున్న కోలాట బృందం

రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే: గీతాజయంతిని పురస్కరించుకుని గోపాల్‌నగర్‌ పుంతరోడ్డులోని శ్రీకృష్ణ దేవాలయంలో గోదావరి జలాలతో స్వామివారికి వైభవంగా అభిషేకం నిర్వహించారు. ఆదివారం ఉదయం పుష్కరఘాట్‌లో స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించి హారతి అందించారు. మహిళలు 108 కలశాలతో పవిత్ర గోదావరి నీటిని తలపై ఉంచి ఘాట్‌ నుంచి నగర వీధుల్లో ఊరేగింపుగా గోపాల్‌నగర్‌లోని ఆలయానికి చేరుకున్నారు. స్వామివారి ఉత్సవమూర్తులను వాహనంలో ఉంచి ఊరేగింపులో హరేకృష్ణ హరేనామ స్మరణ చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు పి.సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భక్తులకు ప్రసాద వితరణ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని