logo

ఆరోగ్యకార్డుపై పూర్తి వైద్యం అందించాలి

విశ్రాంత ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆరోగ్యకార్డుల ద్వారా పూర్తిస్థాయిలో వైద్యం అందించాలని, రీయంబర్స్‌మెంట్‌ బిల్లులు త్వరగా మంజూరు చేయాలని కోరారు.

Published : 05 Dec 2022 06:20 IST

మాట్లాడుతున్న అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు గోగురాజు

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: విశ్రాంత ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆరోగ్యకార్డుల ద్వారా పూర్తిస్థాయిలో వైద్యం అందించాలని, రీయంబర్స్‌మెంట్‌ బిల్లులు త్వరగా మంజూరు చేయాలని కోరారు. సర్వీసు పెన్షన్‌ పొందే వ్యక్తి మరణిస్తే వారి భర్త, భార్యకు మట్టి ఖర్చులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ తీర్మానించింది. కాకినాడ ఆనందభారతి మైదానంలోని మున్సిపల్‌ సుపీరియర్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ భవనంలో ఆ సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.గోగురాజు మాట్లాడుతూ సమైక్యంగా పోరాడం వల్లే 010 పద్దు ద్వారా మున్సిపల్‌ ఉద్యోగులకు ట్రెజరీ ద్వారా వేతనాలు సాధించామన్నారు. ముఖ్యఅతిథిలుగా హాజరైన కాకినాడ మున్సిపల్‌ అదనపు కమిషనర్‌ సీహెచ్‌ నాగనరసింహారావు, కార్యదర్శి ఎం.ఏసుబాబు, మేనేజరు కర్రి సత్యనారాయణ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఉమ్మడి జిల్లా కార్యదర్శి శాస్త్రి మాట్లాడుతూ పీఆర్‌సీలో విశ్రాంత ఉద్యోగులకు అన్యాయం జరిగిందన్నారు. పురపాలక ఉద్యోగుల ఎస్‌ఆర్‌లు సక్రమంగా నిర్వహించడంలేదన్నారు. అంతకుముందు దివంగత సీఎం వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉద్యోగ సంఘం నాయకుడిగా సేవలందించి ఉద్యోగ విరమణ చేసిన దామెర మురళిని సత్కరించారు. అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ నరసింహమూర్తి, కోశాధికారి పి.రమణరావు తదితరులు పాల్గొన్నారు.
కొత్త జిల్లాలకు కన్వీనర్లు: మూడు జిల్లాలకూ మున్సిపల్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ కన్వీనర్లను ఎన్నుకున్నారు. కాకినాడ జిల్లాకు ఆకుమర్తి సామ్యూల్‌, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాకు ఉదయభాస్కర్‌, తూర్పుగోదావరి జిల్లాకు ఎం.రామారావుపట్నాయక్‌ను నియమించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని