logo

కత్తిపూడిలో మరణం.. విజయవాడలో ఖననం

మండలంలోని కత్తిపూడిలో ముస్లింలకు శ్మశాన వాటిక లేక చివరి మజీలికి వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Published : 05 Dec 2022 06:23 IST

అంబులెన్సులో రఫీ మృతదేహం తరలింపు

శంఖవరం, న్యూస్‌టుడే: మండలంలోని కత్తిపూడిలో ముస్లింలకు శ్మశాన వాటిక లేక చివరి మజీలికి వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా సుమారు 100 కుటుంబాలు నివసిస్తున్నాయి. తమలో ఎవరైనా మృతి చెందితే ఖననం చేయడానికి సొంత ఊరిలో స్థలం లేదని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో ఎస్‌.కె.రఫీ (47) అనే వ్యక్తి మృతి చెందగా ఖననం చేసేందుకు స్థలం లేక బంధువులు మృతదేహాన్ని ఆదివారం విజయవాడ తీసుకెళ్లారు. కొన్ని సంవత్సరాల క్రితం రఫీ అక్కడి నుంచి కత్తిపూడి వచ్చి స్థిరపడ్డారు. ఇక్కడ స్థలం లేకపోవడంతో బంధువులు అంబులెన్సులో మృతదేహాన్ని విజయవాడ తీసుకెళ్లారు. గతంలోనూ పలుమార్లు శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలంటూ ప్రజాప్రతినిధులకు, అధికారులకు విన్నవించినా ఉపయోగం లేదని స్థానిక మత పెద్దలు వాపోతున్నారు. ఇకనైనా స్థానిక ప్రజాప్రతనిధులు, అధికారులు స్పందించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని