logo

దిగుమతికి అభ్యంతరం చెబితే నోటీసులు

రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సంబంధించి తేమ శాతం నిర్ధారణ ఒకసారే చేయాలని, మిల్లుల వద్ద ధాన్యం దిగుమతి చేసే సమయంలో మిల్లర్లు అభ్యంతరం చెబితే వారికి నోటీసులు జారీ చేయాల్సి ఉంటుందని కలెక్టర్‌ మాధవీలత హెచ్చరించారు.

Updated : 06 Dec 2022 05:15 IST

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం): రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సంబంధించి తేమ శాతం నిర్ధారణ ఒకసారే చేయాలని, మిల్లుల వద్ద ధాన్యం దిగుమతి చేసే సమయంలో మిల్లర్లు అభ్యంతరం చెబితే వారికి నోటీసులు జారీ చేయాల్సి ఉంటుందని కలెక్టర్‌ మాధవీలత హెచ్చరించారు. కలెక్టరేట్‌ నుంచి జేసీ శ్రీధర్‌తో కలిసి పలు అంశాలపై అధికారులతో సోమవారం వీసీ నిర్వహించారు. రైతులకు అవసరమైన గోనె సంచులు  సరఫరా చేయడంలో క్షేత్రస్థాయి అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జేసీ తేజ్‌భరత్‌ మాట్లాడుతూ  క్షేత్రస్థాయిలో ఏదైనా సమస్య వస్తే మండల అధికారులు స్పందించి రైతులకు అవగాహన కల్పించాలని, ఈ విషయంలో తహసీల్దార్లు, ఎంపీడీవోలూ భాగస్వాములు కావాలన్నారు. ప్రతి శుక్రవారం ఆర్బీకేల పరిధిలో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి చెల్లింపుల వివరాలు నోటీసు బోర్డులో ప్రదర్శించాలన్నారు.

* కంట్రోల్‌ రూం ఏర్పాటు:  ధాన్యం కొనుగోలు సమస్యలపై కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని జేసీ చెప్పారు. రైతులు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు 83094 87151, 0883-2940788 నంబర్లలో   సంప్రదించాలన్నారు.

* పౌర సేవలపై సమీక్ష: జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందించే పౌర సేవలపై కలెక్టర్‌ మాధవీలత సమీక్షిస్తూ కొన్ని సచివాలయాల్లో పౌర సేవలు తక్కువగా అందుతున్నాయని  సేవలందించే సామర్థ్యం పెంచుకోవాలని ఆదేశించారు.

* ఇద్దరు అధికారులకు షోకాజ్‌: గృహ నిర్మాణాల పురోగతిపై కలెక్టర్‌ సమీక్షిస్తూ స్టేజ్‌ కన్వర్షన్‌లో మూడంకెల ప్రగతి ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణాల్లో పురోగతి సాధించడంలో విఫలమైన నిడదవోలు మున్సిపల్‌ కమిషనర్‌, హౌసింగ్‌ ఏఈలకు షోకాజ్‌ నోటీసు ఇవ్వాలని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని