logo

‘కన్నపేగునే కాదంటున్నాడు’

చిత్రంలో చిన్నారితో ఉన్న ఈమె పేరు వసంత. కాకినాడ జిల్లా పెదపూడి మండలం జి.మామిడాడకు చెందిన ఈమెను అదే గ్రామానికి చెందిన ముప్పిడి రవి నమ్మించి మోసం చేయడంతో ఆమె ఓ ఆడ బిడ్డకు తల్లి అయింది.

Published : 06 Dec 2022 04:00 IST

కలెక్టర్‌కు గోడు వినిపిస్తున్న వసంత..

చిత్రంలో చిన్నారితో ఉన్న ఈమె పేరు వసంత. కాకినాడ జిల్లా పెదపూడి మండలం జి.మామిడాడకు చెందిన ఈమెను అదే గ్రామానికి చెందిన ముప్పిడి రవి నమ్మించి మోసం చేయడంతో ఆమె ఓ ఆడ బిడ్డకు తల్లి అయింది. పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టినా అతను అంగీకరించలేదు.
ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 3 నెలలు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు. ఇప్పటికైనా అతను మారుతాడనుకున్న ఆమెకు నిరాశ ఎదురైంది. నీవు ఎవరో తెలియదని, ఈ బిడ్డకు, తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పటంతో ఏం చేయాలో తెలియక పెదపూడి ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన జిల్లా స్థాయి స్పందనలో తన గోడును కలెక్టర్‌ కృతికాశుక్లా వద్ద మొరపెట్టుకుంది.. తన బిడ్డకు డీఎన్‌ఏ పరీక్ష చేయించి న్యాయం చేయాలని వేడుకుంది.. స్పందించిన కలెక్టర్‌ వెంటనే డీఎన్‌ఏ పరీక్షలు చేయించాలని వైద్యాధికారులకుఆదేశిస్తూ.. న్యాయం చేస్తామని ఆమెకు భరోసానిచ్చారు.

ఈనాడు, కాకినాడ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని