logo

రిటైర్డ్‌ పోలీసు ఇన్‌స్పెక్టర్‌కు మూడేళ్ల జైలు

ఆదాయానికి మించి ఆస్తుల కేసు విషయంలో స్పెషల్‌ బ్రాంచ్‌(ఎస్‌బీ) రిటైర్డ్‌ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ ఎం.వెంకటేశ్వరరావుకు మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష

Published : 06 Dec 2022 04:00 IST

శ్యామలాసెంటర్‌ (రాజమహేంద్రవరం): ఆదాయానికి మించి ఆస్తుల కేసు విషయంలో స్పెషల్‌ బ్రాంచ్‌(ఎస్‌బీ) రిటైర్డ్‌ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ ఎం.వెంకటేశ్వరరావుకు మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.5 లక్షల జరిమానా, అది చెల్లించకుంటే మరో ఆరు నెలలపాటు సాధారణ జైలు శిక్ష విధిస్తూ రాజమహేంద్రవరం అవినీతి నిరోధకశాఖ కోర్టు సోమవారం తీర్పు ఇచ్చింది. విశాఖపట్నం పోలీసు కమిషనరేట్‌లోని ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌గా 1996లో పనిచేసిన వెంకటేశ్వరరావు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ప్రాథమిక సమాచారంతో రాజమహేంద్రవరం ఏసీబీ అధికారులు అప్పట్లో కేసు నమోదుచేసి సోదాలు చేశారు. ఈ క్రమంలో నేరం రుజువు కావటంతో ఏసీబీ కోర్టు పై విధంగా తీర్పునిచ్చింది. సోదాల్లో అక్రమంగా కూడబెట్టిన తొమ్మిది రకాల ఆస్తులను ప్రభుత్వపరం చేస్తున్నట్లు తీర్పులో వెల్లడించారు. ఈ కేసును ఏసీబీ కోర్టులో పి.పి.శేషయ్య వాదించగా ఏసీబీ అదనపు సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ సీహెచ్‌ సౌజన్య పర్యవేక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని