logo

సర్దుబాట్లు వద్దు.. బదిలీలు చేయాలి

ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో విద్యాశాఖ అతలాకుతలమైందని యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకరవర్మ ఆరోపించారు.

Published : 06 Dec 2022 04:00 IST

డీఈవో కార్యాలయం ముందు ఉపాధ్యాయుల ధర్నా

వెంకట్‌నగర్‌: ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో విద్యాశాఖ అతలాకుతలమైందని యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకరవర్మ ఆరోపించారు. ‘వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ వద్దు - బదిలీల జరపాలి’ ఉద్యోగోన్నతి పొందినవారికి తాత్కాలిక స్థానాన్ని కేటాయించాలని కోరుతూ యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు కేవీవీ నగేష్‌ అధ్యక్షతన డీఈవో కార్యాలయం ఎదుట సోమవారం మెరుపు ధర్నా నిర్వహించారు. బదిలీలు జరపక సబ్జెక్టు టీచర్లను సర్దుబాటు పేరుతో మూడు రోజులు ఒక పాఠశాల, తరువాత మరోచోట బోధించడం వల్ల విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి తోటకూర చక్రవర్తి మాట్లాడుతూ విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. అనంతరం డీఈవో ఆర్‌.డేనియల్‌రాజుకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు అన్నా రాము, ఐ.ప్రసాదరావు, బి.నాగమణి, గణేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని