logo

క్రమశిక్షణతో పనిచేయాలి

హోంగార్డ్స్‌ విభాగం పోలీసు శాఖకు వెన్నెముకలా నిలిచి, విధి నిర్వహణలో ఉత్తమ సేవలందిస్తుందని జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు అన్నారు.

Published : 07 Dec 2022 02:51 IST

హోంగార్డుల గౌరవ వందనం స్వీకరిస్తున్న ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు

మసీదు సెంటర్‌ (కాకినాడ), న్యూస్‌టుడే: హోంగార్డ్స్‌ విభాగం పోలీసు శాఖకు వెన్నెముకలా నిలిచి, విధి నిర్వహణలో ఉత్తమ సేవలందిస్తుందని జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు అన్నారు. కాకినాడ పోలీసు కవాతు మైదానంలో హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరై హోంగార్డుల నుంచి గౌరవ వందనం స్వీకరించి, కవాతు తిలకించారు. ఆయన మాట్లాడుతూ కాకినాడ యూనిట్‌లో 993 మంది విధులు నిర్వహిస్తున్నారని, క్రమశిక్షణతో పనిచేస్తూ అందిరికీ మార్గదర్శకంగా నిలవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కానిస్టేబుళ్ల నియామకాల్లో హోంగార్డులకు 15 శాతం రిజర్వేషన్‌ ఇచ్చినట్లు తెలిపారు. ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన సాపే తాతయ్య, సూర్యనారాయణలకు హోంగార్డులు తమ ఒకరోజు జీతాలను విరాళంగా ఇచ్చిన చెక్కులను ఎస్పీ అందజేశారు. 2022లో మహిళా హోంగార్డ్‌ జి.పరమేశ్వరి సీనియర్‌ నేషనల్స్‌ గ్రాఫ్లింగ్‌ పోటీల్లో మూడో స్థానం సాధించినందుకు ఆమెను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు పి.శ్రీనివాస్‌, బి.సత్యనారాయణ, డీఎస్పీలు అంబికాప్రసాద్‌, మురళీకృష్ణారెడ్డి, హోంగార్డ్స్‌ ఆర్‌ఐ వెంకట అప్పారావు, ఆర్‌ఐ శ్రీహరి, రిజర్వు సీఐలు, కాకినాడ పట్టణ, రూరల్‌ సీఐలు, ఎస్సైలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని