logo

శ్రీవారికి సిరులు.. భక్తులకు వసతులు

కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరుని దర్శించుకున్నా..స్వామికి సేవ చేసినా వారి జీవితాలు సుఖసంతోషాలతో వర్ధిల్లుతాయని భక్తుల విశ్వాసం. అందుకే స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది.

Published : 07 Dec 2022 02:51 IST

న్యూస్‌టుడే, ఆత్రేయపురం

వాడపల్లి దేవాలయం

కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరుని దర్శించుకున్నా..స్వామికి సేవ చేసినా వారి జీవితాలు సుఖసంతోషాలతో వర్ధిల్లుతాయని భక్తుల విశ్వాసం. అందుకే స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. భక్తుల అవసరాలు తీర్చేలా అనేక మంది దాతలు ముందుకొచ్చి దేవస్థానం అభివృద్ధికి సహకరిస్తున్నారు. ఆలయంలో కల్యాణ మండపం, గ్రానైట్‌ నిర్మాణ పనుల దగ్గర్నుంచి, బంగారు వస్తువులు చేయించడం, నిత్యాన్నదానానికి భారీగా విరాళాలు అందుతున్నాయి.

నిత్యాన్నదాన పథకానికి వచ్చిన విరాళాల సొమ్ము రూ.6.67 కోట్లు బ్యాంకుల్లో ఉంది. దీనిపై వచ్చే వడ్డీతోనే 2004 నుంచి అన్నదాన కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు. రూ.లక్ష పైబడి ఇచ్చే దాతలను మహారాజ పోషకులుగా, రూ.50 వేల నుంచి రూ.లక్షలోపు ఇచ్చేవారిని రాజ పోషకులుగా గుర్తిస్తారు. ఒక్క శనివారం రోజునే 15 నుంచి 20వేల మందికి అన్నసంతర్పణ చేస్తున్నారు.

భూరి దాతల్లో కొందరు..

* రథం ఏర్పాటుకు వంక నరేంద్రబాబు (మండపేట) రూ.5.40 కోట్లు విరాళం

* అన్నప్రసాద నిర్వహణకు శ్రీవేంకటేశ్వర జనరల్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ (రాజమహేంద్రవరం) వారు 21 సెంట్ల భూమి (అప్పట్లో రూ.3.25 లక్షలు విలువ)

* రూ.70 లక్షలతో బంగారు కిరీటం- సత్తి బాంగార్రెడ్డి (గోపాలపురం)

* కొత్తపేటకు చెందిన బొరుసు భాస్కరరావు బంగారు పాదాలు అందించారు.

రూ.50 లక్షలతో కల్యాణ మండపం

- గుత్తేదారుల సంఘం


తక్షణ అవసరాలివీ..

* ఏడు వారాల భక్తుల ప్రదక్షిణాలు చేసేందుకు అనువుగా మాడ వీధులను అభివృధ్ది చేయాలి

* దూర ప్రాంతాల భక్తులకు విశ్రాంతి గదులు, డార్మిటరీ సదుపాయం

నిత్యాన్నదాన కేంద్రంలో రద్దీ సమయాల్లో భక్తులకు విశాలంగా కూర్చుని తినేలా సదుపాయం

* భక్తుల మౌలిక వసతులు తాగునీరు, మరుగుదొడ్లు

* ఎల్లవేళలా పటిష్ఠ నిఘా నేత్రాల నడుమ భక్తులకు భద్రత.

దాతలు నిర్మించిన కల్యాణ మండపం


అంచెలంచెలుగా అభివృద్ధి పథాన..

పదేళ్లుగా దేవస్థానం ఆదాయం అంచెలంచెలుగా పెరుగుతూ వస్తోంది. ఆలయం ఈవో స్థాయి నుంచి డిప్యూటీ కమిషనర్‌ స్థాయికి పెరిగింది. 2017లో ఈవో బాధ్యతలుగా చేపట్టిన తరువాత 8 ఎకరాలు భూమికి రూ.56 లక్షలతో 40 అడుగుల రహదారి మార్గం కోసం భూమి కొనుగోలు చేసి ఆలయానికి బయట వ్యక్తుల జోక్యం లేకుండా చేశాం. అలాగే అదే పొలంలో రూ.కోటి వ్యయంతో పార్కింగ్‌ మెరక చేసి తీర్చిదిద్దాం. అనంతరం రూ.4 కోట్లతో ప్రాకార మండపం నిర్మించాం. 92-93లో దేవస్థానానికి కేవలం రూ.1.85 లక్షలు ఉండే ఆదాయం నేడు ఏడాదికి రూ.9కోట్లకు చేరిందన్నారు. ఆలయ అభివృద్ధికి దేవస్థానం పాలకమండలి అందిస్తున్న చేయూత మరువలేనిది.

ఎం.సత్యనారాయణరాజు, ఈవో

Read latest East godavari News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు