logo

మొదటి విడత ‘నాడు-నేడు’ నిధులు వెనక్కి!

నాడు-నేడు పనుల్లో భాగంగా మొదటి విడతలో ఖర్చు చేయని నిధులు వెనక్కి మళ్లనున్నాయి. ఈ మేరకు పాఠశాల మౌలిక సదుపాయాల కమిషనర్‌ నుంచి ఉత్తర్వులు జారీ అయినట్లు సమాచారం.

Published : 08 Dec 2022 03:58 IST

అసంపూర్తిగా ఉన్న కాకినాడ శ్రీరామ్‌నగర్‌లోని ఉన్నత పాఠశాల భవనం

కాకినాడ(వెంకట్‌నగర్‌), న్యూస్‌టుడే: నాడు-నేడు పనుల్లో భాగంగా మొదటి విడతలో ఖర్చు చేయని నిధులు వెనక్కి మళ్లనున్నాయి. ఈ మేరకు పాఠశాల మౌలిక సదుపాయాల కమిషనర్‌ నుంచి ఉత్తర్వులు జారీ అయినట్లు సమాచారం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1331 పాఠశాలల్లో రూ.252 కోట్లతో మొదటి విడత నాడు-నేడు పనులు చేపట్టారు. దాదాపు చాలా వరకు పనులు పూర్తి కాగా కొన్నిచోట్ల ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వీటికి సంబంధించి నిధులు ఖర్చు కాకుండా ఉన్నాయి. రెండో విడత పనులు జిల్లాల విభజన అనంతరం మొదలయ్యాయి. వీటికి సంబంధించి రివాల్వింగ్‌ ఫండ్‌గా రూ. 57 కోట్లు విడుదల చేశారు. వీటితో కొన్ని పాఠశాలల్లో పనులు మొదలుపెట్టారు. కొన్నిచోట్ల ఇసుక, మరికొన్ని చోట్ల నిధుల కొరతతో ఇవి మందకొడిగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి విడతలో మిగిలిన నిధులను రెండో విడతలో వినియోగించుకోవాలని భావించినా.. ప్రభుత్వం వెనక్కి పంపించాలని ఆదేశించినట్లు తెలిసింది. కాకినాడ జిల్లా నుంచి అత్యధికంగా రూ.28 కోట్లు, తూర్పుగోదావరి నుంచి సుమారు రూ.13 కోట్లు, అంబేద్కర్‌ కోనసీమ జిల్లా నుంచి సుమారు రూ. 11 కోట్లు వెనక్కి మళ్లనున్నాయి. వీటిని వెంటనే ప్రధాన కార్యాలయంలోని ఖాతాకు మళ్లించాలని సూచించారు. వాటిని నిధులు అవసరమైన జిల్లాల్లో వినియోగిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని