logo

Annavaram: ఇకపై అరిటాకులకు బదులు కంచాల్లోనే అన్న ప్రసాదం

కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో నిత్యాన్నదాన పథకంలో భక్తులకు ఇకపై అరిటాకులకు బదులు కంచాల్లోనే అన్నప్రసాదం అందించనున్నారు.

Updated : 08 Dec 2022 08:53 IST

ఆకుల్లో భోజనం చేస్తున్న భక్తులు (పాత చిత్రం)

అన్నవరం, న్యూస్‌టుడే: కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో నిత్యాన్నదాన పథకంలో భక్తులకు ఇకపై అరిటాకులకు బదులు కంచాల్లోనే అన్న ప్రసాదం అందించనున్నారు. గురువారం మధ్యాహ్నం నుంచి ఈ విధానం ఆచరణలోకి రానుంది. సత్యనారాయణ స్వామి క్షేత్రంలో నిత్యాన్నదాన పథకాన్ని 35 ఏళ్ల క్రితం 200 మందితో ప్రారంభించారు. భక్తుల విరాళాలు రూ. 54 కోట్లు బ్యాంకులో డిపాజిట్‌ చేసి... వడ్డీతో నిత్యం మధ్యాహ్నం పూట అన్నప్రసాదం అందిస్తున్నారు. నిత్యాన్నదానం ప్రారంభం నుంచి అరిటాకుల్లో భక్తులకు భోజనాలు వడ్డిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు, పర్వదినాలు, రద్దీ రోజుల్లో అరిటాకుల లభ్యత పూర్తి స్థాయిలో లేకపోవడం, వ్యయం తగ్గుతుండటంతో కంచాల్లో భోజనాలు పెట్టాలని నిర్ణయించారు. కంచాలు శుభ్రం చేయడానికి యంత్రాలను సిద్ధం చేశారు. గురువారం నుంచి బఫే (నిల్చుని తినే) విధానం అమలు చేయాలని నిర్ణయించినప్పటికీ.. ఇంకా హాలు సిద్ధం కాకపోవడం, క్యూలైను పనులు పూర్తికాకపోవడంతో వాయిదా వేశారు. కొద్ది రోజుల్లో బఫే విధానాన్ని ప్రారంభించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని