logo

బీసీలకు అన్నివిధాలా అన్యాయం: తెదేపా

రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అన్నివిధాలా అన్యాయం చేస్తోందని తెదేపా నాయకులు విమర్శించారు.

Published : 08 Dec 2022 03:58 IST

నిరసన తెలుపుతున్న మాజీ మంత్రి జవహర్‌, ఎమ్మెల్యే భవానీ, గన్ని కృష్ణ తదితరులు

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం): రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అన్నివిధాలా అన్యాయం చేస్తోందని తెదేపా నాయకులు విమర్శించారు. ‘ఇదేం ఖర్మ... మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా బీసీలకు వైకాపా ప్రభుత్వం అన్యాయం చేస్తోందని కలెక్టరేట్‌ వద్ద బుధవారం ఆందోళన నిర్వహించారు. మాజీ మంత్రి కె.ఎస్‌.జవహర్‌, రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, నాయకులు గన్ని కృష్ణ, మద్దిపాటి వెంకటరాజు, యర్రా వేణుగోపాల్‌, మత్సేటి ప్రసాద్‌ తదితరులు మాట్లాడారు. ఎన్నికలు సమీపిస్తున్నందునే జయహో బీసీ సభను పెట్టి మోసగించే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. మూడున్నరేళ్లలో విద్య, ఉపాధి రంగాల్లో బీసీలకు ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలన్నారు. తెదేపా హయాంలో ప్రవేశపెట్టిన విదేశీ విద్యా పథకాన్ని రద్దు చేశారని, బీసీ ఉపప్రణాళిక నిధులను పక్కదారి పట్టించారని, ఆదరణ పథకాన్ని ముసివేశారని ఆందోళన వ్యక్తం చేశారు. తెదేపా హయాంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఉండగా జగన్‌ వాటిని 24 శాతానికి తగ్గించేశారన్నారు. బీసీల సమస్యలపై జేసీ తేజ్‌భరత్‌కు వినతిపత్రం అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని