logo

మీరక్కడుంటే.. మేమెక్కడ?

రహదారి పక్కన నిర్మించిన బస్సు షెల్టర్‌ను కొందరు ఆక్రమించడంతో ప్రయాణికులకు నీడ కరవైంది.

Published : 08 Dec 2022 03:58 IST

రోడ్డుపై విద్యార్థుల నిరీక్షణ

కాజులూరు: రహదారి పక్కన నిర్మించిన బస్సు షెల్టర్‌ను కొందరు ఆక్రమించడంతో ప్రయాణికులకు నీడ కరవైంది. కాజులూరు మండలంలోని కుయ్యేరు గ్రామంలో నిర్మించిన బస్సుషెల్టర్‌ను కొందరు తమ ఆధీనంలోకి తీసుకుని బరకాల వ్యాపారం చేస్తున్నారు. యానాం, ద్రాక్షారామం వెళ్లే ప్రయాణికులు విశ్రాంతి తీసుకునేందుకు దీన్ని నిర్మించారు. ఈ షెల్టర్‌ను ఆక్రమించడంతో ఎండావానల్లో రోడ్డుపైనే నిరీక్షించవలసి వస్తోందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్సుషెల్టర్‌ పక్కనే జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 410 మంది విద్యార్థులు చదువుతున్నారు. సుమారు 250 మంది బస్సుల్లో రాకపోకలు చేస్తుంటారు. పాఠశాల అనంతరం ఇంటికి వెళ్లేందుకు రోడ్డుపైనే బస్సులు వచ్చేవరకు నిలబడవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారి కావడంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బస్సుషెల్టర్‌ను ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు.

బస్‌షెల్టర్‌లో బరకాల వ్యాపారం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని