logo

ఇంటిని అప్పగించారో.. లేదో తేల్చండి

న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి పిటిషనర్లకు సకాలంలో ఇంటిని అప్పగించారా? లేదా అనే వ్యవహారంపై కోరుకొండ తహసీల్దార్‌, ఎస్సైపై జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌తో విచారణ జరిపించి నివేదిక సమర్పించాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ జ్యుడీషియల్‌ను హైకోర్టు ఆదేశించింది.

Published : 08 Dec 2022 03:58 IST

రిజిస్ట్రార్‌ జ్యుడీషియల్‌కు హైకోర్టు ఆదేశం

ఈనాడు, అమరావతి: న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి పిటిషనర్లకు సకాలంలో ఇంటిని అప్పగించారా? లేదా అనే వ్యవహారంపై కోరుకొండ తహసీల్దార్‌, ఎస్సైపై జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌తో విచారణ జరిపించి నివేదిక సమర్పించాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ జ్యుడీషియల్‌ను హైకోర్టు ఆదేశించింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. న్యాయమూర్తి జస్టిస్‌ డి.రమేశ్‌ బుధవారం ఈ ఆదేశాలిచ్చారు. కోరుకొండ మండలం గాడాల గ్రామంలోని తమ ఇంటిని తహసీల్దార్‌ స్వాధీనం చేసుకుని, ఎవరూ ప్రవేశించకుండా నిలువరిస్తూ ఉత్తర్వులిచ్చారని పేర్కొంటూ బి.పద్మావతి, ఆమె భర్త సుబ్బారావు హైకోర్టును ఆశ్రయించారు. సెప్టెంబర్‌ 6న విచారణ జరిపిన న్యాయస్థానం.. తహసీల్దార్‌ జారీచేసిన స్వాధీన ఉత్తర్వులను సస్పెండ్‌ చేస్తూ, ఇంటిని పిటిషనర్లకు అప్పగించాలని ఆదేశించింది. ఆ ఉత్తర్వులను అధికారులు అమలు పరచలేదని పద్మావతి కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. దీనిపై బుధవారం జరిగిన విచారణలో న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. ఇప్పటికీ ఇంటి తాళానికి సీలు వేసి ఉందని, పిటిషనర్లకు అప్పగించలేదన్నారు. అధికారులు కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. దీంతో న్యాయమూర్తి విచారణకు ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని