ఆరు శీతల గోదాములు మంజూరు
గతంలో కొబ్బరిప్యాక్ హౌస్‌లు మంజూరు చేసేవారు. ఈ మధ్య అవి మంజూరు కావడంలేదు. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.
కొబ్బరితోటల విస్తీర్ణం అపారంగా ఉన్నప్పటికీ అత్యధికశాతం మంది రైతులు నేరుగా దానిమీద వచ్చే కొబ్బరికాయల మీదే ఆధారపడుతున్నారు. ఉప ఉత్పత్తుల పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో ఏళ్లు గడుస్తున్నా ఈ రైతులు ముందుకు వెళ్లలేకపోతున్నారు. కూరగాయలు పండించే రైతులకు గిట్టుబాటు ధర లభించే వరకు వాటిని నిల్వచేసుకునేందుకు అనువైన వసతులు లేని పరిస్థితుల మధ్య ఈ రైతులు ఉత్పత్తులను అయినకాడికి అమ్ముకోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉద్యాన పంటల పరంగా రైతులకు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు... వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు తదితర అంశాలపై డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమజిల్లా ఉద్యానశాఖాధికారి ఎన్.మల్లికార్జునరావుతో
‘న్యూస్‌టుడే’ ముఖాముఖి.
జిల్లాలో ఉద్యాన పంటలసాగు విస్తీర్ణం ఎంత...?
అధికారి: జిల్లావ్యాప్తంగా 55వేల హెక్టార్ల విస్తీర్ణం ఉంది. దీంట్లో కొబ్బరితోటల విస్తీర్ణం 38వేల హెక్టార్లు. మిగిలినది అరటి ఇతర పంటలు
కొబ్బరి రైతులను ప్రోత్సహించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు
వ్యక్తిగతంగా... రైతు ఉత్పత్తిసంఘాలకు విలువ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రోత్సహిస్తున్నాం. మొత్తం యూనిట్ విలువలో పదిశాతం రైతు ప్రాథమికంగా పెట్టుబడి పెట్టాలి. 90 శాతం బ్యాంకురుణంగా ఉంటుంది. దీంట్లో 35 శాతం రాయితీ సదుపాయం ఉంది. దీనిద్వారా కొబ్బరితోటలు ఆధారం చేసుకుని ఉపఉత్పత్తుల పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఔత్సాహికులు ముందుకు రావాలి.
ఉద్యాన పంటల ద్వారా ఆహార ఉత్పత్తులు చేసేవారికి ప్రోత్సహకాలు ఏమైనా ఉన్నాయా...?
ఎ.పి.ఫుడ్‌ప్రోసెసింగ్ సొసైటీ జిల్లా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా జిల్లా ఉద్యానశాఖాధికారులను ప్రభుత్వం నియమించింది. తినుబండారాలు తయారుచేసే వారిని ప్రోత్సహించేందుకు యూనిట్ నెలకొల్పేందుకు గరిష్ఠంగా రూ.30లక్షలు ప్రభుత్వం మంజూరు చేస్తుంది. దీంట్లో గరిష్ఠంగా రూ.10లక్షలు రాయితీ ఉంటుంది. ఔత్సాహికులు ఉద్యానశాఖాధికారులను కలిస్తే వీటిగురించి అవగాహన కల్పిస్తారు.
కూరగాయలు పండించే రైతులకు ప్రోత్సాహకాలు ఏమైనా ఉన్నాయా...?
ఈ రైతులు రైతు ఉత్పత్తి సంఘాలుగా ఏర్పడాలి. టమోటా తదితర ఉత్పత్తులు నిల్వచేసుకునేందుకు జిల్లాకు కొత్తగా ఆరు కోల్డ్ స్టోరేజ్‌లు (శీతల గోదాములు వంటివి) మంజూరయ్యాయి. ఒక్కో యూనిట్ విలువ రూ.15లక్షలు. దీంట్లో 75 శాతం రాయితీ వర్తిస్తుంది.
గతంలో కొబ్బరిప్యాక్ హౌస్‌లు మంజూరు చేసేవారు. ఈ మధ్య అవి మంజూరు కావడంలేదు. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.
రైతుఉత్పత్తి సంఘాలకు కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఒక్కో యూనిట్ విలువ రూ.15లక్షలు. దీంట్లో 75శాతం రాయితీ వర్తిస్తుంది. కొబ్బరి రైతులకు వీటిని అమలు చేస్తున్నాం.
సంప్రదాయ ఉద్యానపంటలపై రైతులు ఆధారపడుతున్నారు. మన వాతావరణానికి తగిన విధంగా కొత్తతరహా పంటలను ఏమైనా ప్రోత్సహిస్తున్నారా...?
సముద్రతీర ప్రాంతంలో ఉప్పునీరు కాకుండా తీపినీరు ఉన్న ప్రాంతాల్లో డ్రాగన్ ఫ్రూట్్్స సాగుచేసేందుకు అనువుగా ఉంటుంది. ఈ పంటను సాగుచేసేందుకు అనువైన ప్రాంతాలను గుర్తించి రైతులను ప్రోత్సహిస్తాం.
గత ఏడాది వచ్చిన గోదావరి వరదల ఉద్ధృతికి నష్టపోయిన ఉద్యానపంటలకు ఎంతమేర పరిహారం అందించారు.
సుమారు 15వేల మంది రైతులకు ప్రభుత్వం రూ.10కోట్లు నష్టపరిహారం చెల్లించింది.
న్యూస్‌టుడే, పి.గన్నవరం
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (07/02/23)
-
Crime News
Road Accident: ఆటోను ఢీకొన్న ట్రాక్టర్.. ముగ్గురు మృతి
-
India News
Layoffs: ‘కాబోయేవాడికి ‘మైక్రోసాఫ్ట్’లో ఉద్యోగం పోయింది.. పెళ్లి చేసుకోమంటారా?’
-
Politics News
Revanth Reddy: మార్పు కోసమే యాత్ర: రేవంత్‌రెడ్డి
-
India News
PM Modi: హెచ్ఏఎల్పై దుష్ప్రచారం చేసిన వారికి ఇదే సమాధానం: ప్రధాని మోదీ
-
General News
Andhra news: తమ్ముడూ నేనూ వస్తున్నా.. గంటల వ్యవధిలో ఆగిన గుండెలు