logo

పోలీసు రాత పరీక్షలకు ఏర్పాట్లు

జిల్లావ్యాప్తంగా 18 పరీక్ష కేంద్రాల్లో పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాల రాత పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా పోలీసు కార్యాలయం శనివారం ఓ ప్రకటనలో తెలిపింది.

Published : 22 Jan 2023 05:19 IST

అమలాపురం బీవీసీలో సీఐల సమావేశంలో మాట్లాడుతున్న డీఎస్పీ, సమన్వయకర్త

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: జిల్లావ్యాప్తంగా 18 పరీక్ష కేంద్రాల్లో పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాల రాత పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా పోలీసు కార్యాలయం శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. 8,716 మంది అభ్యర్థులు హాజరవుతారని, ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష ఉంటుందన్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించమని పేర్కొన్నారు. హాల్‌టికెట్లతోపాటు ఒక ఫొటో గుర్తింపుకార్డు, బ్లూ, బ్లాక్‌ బాల్‌ పెన్నులు మాత్రమే తీసుకురావాలన్నారు. ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ నిర్దేశాల ప్రకారం బందోబస్తు ఏర్పాటు చేశారన్నారు. అమలాపురం బీవీసీ ఇంజినీరింగ్‌ కళాశాలలో జిల్లా పోలీసు అధికారులతో డీఎస్పీ
మాధవరెడ్డి, పరీక్షల ప్రాంతీయ సమన్వయకర్త శ్రీరామారావుతో కలిసి సమావేశం నిర్వహించి సూచనలు అందించారు.

పోలీసుస్టేషన్ల పరిధిలో కేంద్రాలు..

అమలాపురం: కాలేజీరోడ్డులో ఎస్‌కేబీఆర్‌ కళాశాల, భూపయ్యఅగ్రహారంలో ఏఎస్‌ఎన్‌ కళాశాల, శ్రీవేంకటేశ్వరడిగ్రీ కళాశాల, పోలీసుస్టేషన్‌ వెనుక విద్యానిధి డిగ్రీ కళాశాల, నల్లవంతెన వద్ద మిరియం డిగ్రీ కళాశాల, ఈదరపల్లి వంతెన వద్ద నారాయణ జూనియర్‌ కళాశాల, ఆదిత్య డిగ్రీ కళాశాలలు, ఈదరపల్లి బైపాస్‌రోడ్డులో శ్రీచైతన్య జూనియర్‌ కాలేజీ, భట్లపాలెం బీవీసీ ఇంజినీరింగ్‌ కళాశాల.

* అల్లవరం: ఓడలరేవు బీవీసీ ఇంజినీరింగ్‌ కళాశాల.

* నగరం: దీప్తీ జూనియర్‌ కాలేజీ

* రాజోలు: తాటిపాకలో వేద డిగ్రీ కళాశాల,

* అంబాజీపేట: ఎస్‌ఎన్‌ఎం డిగ్రీ కళాశాల.

* కాట్రేనికోన: చెయ్యేరు శ్రీనివాస ఇంజినీరింగ్‌ కళాశాల.

* ముమ్మడివరం: ఎయిమ్స్‌ కాలేజ్‌, తారా కాలేజీ.

* రామచంద్రపురం: వీఎస్‌ఎం ఇంజినీరింగ్‌ కళాశాల, అంబికాపల్లి వి.అగ్రహారంలో కైట్స్‌ కళాశాల.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని