logo

డిమాండ్లు నెరవేర్చకుంటే విధుల బహిష్కరణ

తమ డిమాండ్ల సాధనకు 108 ఉద్యోగులు సోమవారం కలెక్టరేటు ఎదుట ధర్నా నిర్వహించారు.

Published : 24 Jan 2023 04:29 IST

కలెక్టరేట్‌ ఎదుట 108 ఉద్యోగుల ధర్నా

ధవళేశ్వరం, న్యూస్‌టుడే: తమ డిమాండ్ల సాధనకు 108 ఉద్యోగులు సోమవారం కలెక్టరేటు ఎదుట ధర్నా నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టరేట్‌ల ఎదుట నిరసన తెలిపామన్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అరబిందో యాజమాన్యం వివిధ కారణాలతో తొలగించిన సిబ్బందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, ముఖ్యమంత్రి గతంలో ఇచ్చిన హామీ మేరకు ఏపీ ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌లో చేర్చి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ నిమిత్తం యాజమన్యాల వాటా చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం వర్తింపజేయాలని డిమాండు చేశారు. గతేడాది డిసెంబరు 14న యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చి నిరసన కార్యక్రమాల్లో పాల్గొని ప్రజాప్రతినిధులు, అధికారులకు వినతిపత్రాలు అందజేసినా కనీస స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కారం కాకపోతే ఏసమయంలోనైనా విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి 108 ఉద్యోగుల రాష్ట్ర వర్కింగ్‌ కమిటీ కార్యదర్శి వీవీ సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు, 108 ఉద్యోగులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని