logo

త్వరితగతిన భూ రీసర్వే పూర్తి

జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష రీసర్వేలో భాగంగా గ్రామాల్లో చేపట్టిన రీసర్వేను త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్‌ హిమాన్షుశుక్లా అధికారులను ఆదేశించారు.

Updated : 24 Jan 2023 05:33 IST

సమీక్షిస్తున్న కలెక్టర్‌ హిమాన్షుశుక్లా, జేసీ ధ్యానచంద్ర

అమలాపురం కలెక్టరేట్‌: జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష రీసర్వేలో భాగంగా గ్రామాల్లో చేపట్టిన రీసర్వేను త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్‌ హిమాన్షుశుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన వివిధ మండలాల తహసీల్దార్లతో దూరదృశ్య సమావేశం నిర్వహించి ఈ ప్రక్రియను గడువులోగా పూర్తిచేసి, భూహక్కు పత్రాలు పంపిణీకి సిద్ధం చేయాలన్నారు. భూరీసర్వేపై మంగళవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రాజమహేంద్రవరంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం జరగనుందని, జిల్లాలవారీగా సర్వే పురోగతిపై సమీక్ష నిర్వహిస్తారన్నారు. జేసీ ధ్యానచంద్ర, డీఆర్వో సత్తిబాబు, సర్వే, ల్యాండ్స్‌ జిల్లా సహాయ సంచాలకులు గోపాలకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని