logo

గణతంత్ర శోభ

రాజమహేంద్రవరం విమానాశ్రయం విద్యుత్తు కాంతులీనుతోంది. మూడు రంగుల విద్యుద్దీపాలతో ఆకట్టుకుంటోంది.

Published : 26 Jan 2023 03:37 IST

విద్యుత్తు కాంతులీనుతున్న రాజమహేంద్రవరం విమానాశ్రయం

న్యూస్‌టుడే, కోరుకొండ, కడియం: రాజమహేంద్రవరం విమానాశ్రయం విద్యుత్తు కాంతులీనుతోంది. మూడు రంగుల విద్యుద్దీపాలతో ఆకట్టుకుంటోంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విమానాశ్రయాన్ని బుధవారం రాత్రి ఇలా మూడు రంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. టెర్మినల్‌ భవనం లోపల ఆవరణలో వివిధ రకాల పక్షులు, జంతువుల నమూనాలతో పాటు ఇండియా గేట్‌ నమూనాను ఏర్పాటు చేశారు. టెర్మినల్‌ బయట, లోపల ఏర్పాటు చేసిన ఈ అలంకరణలు ప్రయాణికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మూడు రోజుల పాటు ఈ అలంకరణ ఉంటుందని ఏపీడీ ఎస్‌.జ్ఞానేశ్వరరావు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కడియం పల్ల వెంకన్న నర్సరీలో మొక్కల కూర్పు ఆకట్టుకుంటోంది. మూడు రోజులు శ్రమించి ఈ ఆకృతి ఏర్పాటు చేశామని యువరైతులు పల్ల వినయ్‌, వెంకటేశ్‌ తెలిపారు.

కడియం పల్ల వెంకన్న నర్సరీలో పూల మొక్కలతో కూర్పు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని