logo

‘ప్రత్యేక హోదా ఇస్తే అవినీతికి ఆస్కారం’

రాష్ట్రంలో జరిగే ప్రతి ఎన్నికల్లో ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తెస్తున్నారని... ఇప్పటికే గనులు, మద్యం అవినీతిలో రాష్ట్ర ప్రభుత్వం పండిపోయిందని, ఈ పరిస్థితుల్లో ప్రత్యేక హోదా ఇస్తే అవినీతికి ఆస్కారం ఉంటుందని కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి దేవుసింహ్‌ చౌహాన్‌ అభిప్రాయపడ్డారు.

Published : 27 Jan 2023 05:31 IST

మాట్లాడుతున్న కేంద్ర మంత్రి దేవుసింహ్‌ చౌహాన్‌, పక్కన భాజపా జిల్లా నాయకులు

దేవీచౌక్‌ (రాజమహేంద్రవరం): రాష్ట్రంలో జరిగే ప్రతి ఎన్నికల్లో ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తెస్తున్నారని... ఇప్పటికే గనులు, మద్యం అవినీతిలో రాష్ట్ర ప్రభుత్వం పండిపోయిందని, ఈ పరిస్థితుల్లో ప్రత్యేక హోదా ఇస్తే అవినీతికి ఆస్కారం ఉంటుందని కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి దేవుసింహ్‌ చౌహాన్‌ అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా రాష్ట్రాభివృద్ధి కోసమేనని, దానికోసం ఆంధ్రప్రదేశ్‌కు ఎన్ని నిధులు ఇచ్చేందుకైనా కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. జిల్లా పర్యటనకు తూర్పు గోదావరి విచ్చేసిన ఆయన రెండోరోజు గురువారం రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అత్యధిక నిధులు కేటాయిస్తున్నారన్నారు. పోలవరం ఎత్తు, నీటి నిల్వ సామర్థ్యం పెంచలేదని, అటువంటప్పుడు ప్రాజెక్టు వ్యయం ఎలా పెరుగుతుందని ప్రశ్నించారు. అంచనాలు పెంచడంలో అవినీతి జరిగే అవకాశాలున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వివిధ అభివృద్ధి పనులు, పథకాల కోసం కేంద్రం ఇస్తున్న నిధులు పక్కదారి పడుతున్నాయని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో తెదేపా, వైకాపాలకు దూరంగా ఉంటామన్నారు. సమావేశంలో భాజపా తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు, రాష్ట్ర ఉపాధ్యక్షులు రేలంగి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని