logo

కేంద్ర కారాగారంలో వేడుక

రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలోని జైళ్ల శాఖ కోస్తాంధ్ర డీఐజీ ఎం.ఆర్‌.రవికిరణ్‌ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు నిర్వహించారు.

Updated : 27 Jan 2023 06:25 IST

దానవాయిపేట(రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలోని జైళ్ల శాఖ కోస్తాంధ్ర డీఐజీ ఎం.ఆర్‌.రవికిరణ్‌ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు నిర్వహించారు. కారాగారం ఆవరణలో జెండా వందనం చేసిన డీఐజీ ఖైదీలను ఉద్దేశించి మాట్లాడారు. సత్ప్రవర్తనతో మెలిగితే జీవితం అంధకారం నుంచి బయట పడుతుందని సూచించారు.

నలుగురు ఖైదీలు విడుదల

75వ ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌, 74వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదల జీవో ప్రకారం కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు కానివారిలోని నలుగురు ఖైదీలను గురువారం విడుదల చేసినట్లు రవికిరణ్‌ తెలిపారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ ఎస్‌.రాజారావు, డిప్యూటీ సూపరింటెండెంట్లు రాజ్‌కుమార్‌, కమలాకర్‌, జైలర్‌ రమణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని