పిలుపే.. పరవశమాయె
ఉరిమే ఉత్సాహంతో భక్తజనం ఎదురుచూస్తున్న శుభ సమయం ఆసన్నమైంది. గర్భాలయంలో కొలువైన జగత్పాలకుడు కల్యాణమూర్తిగా దర్శనమిచ్చేందుకు తరలివచ్చే కమనీయ ఘట్టం ఆవిష్కృతమవుతోంది.
పరిణయ ఉత్సవానికి అంతర్వేది ముస్తాబు
న్యూస్‌టుడే: అంతర్వేది, మామిడికుదురు
లక్ష్మీనృసింహస్వామి మూలవిరాట్టు
ఉరిమే ఉత్సాహంతో భక్తజనం ఎదురుచూస్తున్న శుభ సమయం ఆసన్నమైంది. గర్భాలయంలో కొలువైన జగత్పాలకుడు కల్యాణమూర్తిగా దర్శనమిచ్చేందుకు తరలివచ్చే కమనీయ ఘట్టం ఆవిష్కృతమవుతోంది. కల్యాణ పిలుపు కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న భక్తులు దివ్యస్థలికి తరలివచ్చే వేళ.. సాగరసంగమ తీరాన పశ్చిమదిశగా కొలువైన లక్ష్మీనృసింహస్వామివారి ఆలయం కల్యాణకాంతులతో విరాజిల్లుతోంది. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 6 వరకు అంగరంగ వైభవంగా జరిగే పదిరోజుల పరిణయోత్సవాన్ని నేత్రపర్వంగా తిలకించేందుకు సన్నద్ధమవుతున్న వేళ అందరి మది అంతర్వేదే.
రథసప్తమిలో ముద్రికాలంకరణ
ఆరోగ్యప్రదాయ ఆదిత్యాయ అంటూ రథసప్తమి పర్వదినమైన 28వ తేదీ శనివారం తొలిరోజు ఆలయంలో ఉదయం సుప్రభాత సేవ, తిరువారాధన, సుదర్శన హోమం. సాయంత్రం 4.30 గంటలకు సూర్య వాహనం, 6.30 గంటలకు స్వామి, అమ్మవార్లను వధూవరులుగా తీర్చిదిద్దే ముద్రికాలంకరణ ఘట్టం. అనంతరం చంద్రప్రభ వాహనసేవ.
ఘన గరుడు.. దేవదేవుడు
గరుడాళ్వారుగా కీర్తించే గరుత్మంతుడిపై దేవదేవుడు ఆశీలనులై ఊరేగే నయన మనోహర ఘట్టం 29వ తేదీ పురవీధిలో భక్తులను అలరిస్తుంది. పుష్పకవాహనంపై స్వామివారిని కొలువుదీర్చి భక్తజన దివ్య నామస్మరణల నడుమ మంగళవాయిద్యాలతో ఊరేగిస్తారు.
అందరి కళ్లల్లో కల్యాణ వైభోగమే
దశమి మంగళవారం 31న నాలుగో రోజు ఆలయ ప్రాంగణమంతా కల్యాణకాంతులతో నిండిపోతుంది. రాత్రి 12.46 గంటలకు రోహిణీ నక్షత్ర యుక్త తులా లగ్నం పుష్కరాంశమున స్వామివారి దివ్య కల్యాణం అత్యంత వైభవంగా అలరిస్తుంది.
శేషశయనా.. కరుణించుమా
ఆదిశేషునిపై అవనితేజుడు కొలువుదీరి భక్తులకు అభయప్రదానం చేసే కమనీయ గ్రామోత్సవం 30న నేత్రపర్వమవుతుంది. హంస వాహనంపై ఊరేగింపు సాగుతుంది.
దివ్య రథం.. మనోహరం
కల్యాణకాంతులతో మెరిసిపోయే ఉత్సవమూర్తులు దివ్య రథంపై కొలువుదీరి భక్తులను కటాక్షించే మధురమైన ఘట్టం ఫిబ్రవరి 1న శోభాయమానమవుతుంది. భక్తజన సంద్రంలోంచి పరుగులెత్తే దివ్య మనోహర రథాన్ని వీక్షించడం పరమపావనమవుతుంది.
మహానివేదన.. గజ వాహన
స్వామివారి దివ్య సన్నిధిని శుద్ధి చేసేందుకు 2వ తేదీన పొలమూరి సత్రం ఆధ్వర్యంలో అన్నపర్వత మహానివేదన జరుగుతుంది. ఉత్సవమూర్తులకు గజ వాహన, పొన్న వాహన సేవలు మంగళవాయిద్యాలతో నిర్వహిస్తారు.
గర్జన.. భక్తజన రక్షణ
కల్యాణోత్సవాల్లో ఏడో రోజైన 3వ తేదీ సింహ, హనుమద్వాహనాలపై స్వామివారి గ్రామోత్సవాలు. కల్యాణమూర్తులకు మహదాశీర్వచనం పలికే సదస్యం కమనీయంగా సాగుతుంది.
రాజాధిరాజా.. జగత్పాలకా
రాజాధిరాజ, అశ్వ వాహనాలపై కొలువుదీరి భక్తులకు అభయ ప్రదానం చేసే స్వామివారి దివ్య మనోహర గ్రామోత్సవ ఘట్టం ఎనిమిదో రోజైన 4వ తేదీ శనివారం ఆవిష్కృతమవుతుంది.
చక్రస్నానం.. మహద్భాగ్యం
గరుడపుష్పక వాహనంపై స్వామివారిని 5వ తేదీ ఆదివారం అధిరోహింపజేసి గ్రామోత్సవం చేస్తారు. సాగర సంగమ స్థలికి సమీపంలో అవభృథోత్సవం నిర్వహిస్తారు. చక్రపెరుమాళ్‌ను శిరస్సున ధరించి పుణ్యస్నానాలు చేయడం మహద్భాగ్యం. అదేరోజు సాయంత్రం ధ్వజావరోహణం జరుగుతుంది.
పుష్పయాగం.. మహిమాన్వితం
కల్యాణోత్సవాల్లో 6వ తేదీ స్థానిక తటాకంలో హంస వాహనంపై తెప్పోత్సవం విద్యుద్దీపాల సోయగాలతో కాంతులీనుతుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
‘వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఓటేయం’.. ఎచ్చెర్ల ఎమ్మెల్యేకు తేల్చిచెప్పిన వైకాపా కార్యకర్తలు
-
Ap-top-news News
సీఎం జగన్ కోసం 2 గంటలు వాహనాల మళ్లింపు
-
World News
Belarus: ‘అమెరికా ఒత్తిడివల్లే.. రష్యా అణ్వాయుధాలకు చోటు!’
-
India News
కరెంటు కోతతో కోపోద్రిక్తుడై.. డిప్యూటీ సీఎం ఇంట్లో బాంబు పెట్టానంటూ ఫోన్!
-
Sports News
IPL 2023: ఆర్సీబీ మార్చ్‌లో గేల్ డ్యాన్స్..కోహ్లీ అని అరుస్తూ ప్రేక్షకుల కేరింతలు
-
Movies News
Priyanka Chopra: బాలీవుడ్‌పై ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు.. అందుకే హాలీవుడ్‌కి వెళ్లానంటూ