logo

రైతుల సమస్యలు పరిష్కరించండి

రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ అమలాపురంలో రైతు సంఘాల సమన్వయ సమితి నాయకుల ఆధ్వర్యంలో గురువారం ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు.

Published : 27 Jan 2023 05:31 IST

రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో ట్రాక్టర్ల ర్యాలీ

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ అమలాపురంలో రైతు సంఘాల సమన్వయ సమితి నాయకుల ఆధ్వర్యంలో గురువారం ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. సమితి నాయకులు ట్రాక్టర్లపై ఈదరపల్లి వంతెన నుంచి పట్టణం మీదుగా కలెక్టరేట్‌ వరకు ర్యాలీగా వచ్చారు. రైతు పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించాలని, సంపూర్ణ రుణ విముక్తి కల్పించాలని, సేకరించిన ధాన్యానికి నగదు చెల్లించాలని, పొలాల మురుగు కాల్వల్లో పూడిక తొలగించాలని అన్నారు. కౌలురైతులకు గుర్తింపుకార్డులిచ్చి.. భూయజమానితో సంబంధంలేకుండా బ్యాంకు రుణాలిప్పించాలని నినాదాలు చేశారు. సమితి ఛైర్మన్‌ యాళ్ల బ్రహ్మానందం, రైతు పరిరక్షణ సమితి కోకన్వీనర్‌ సత్తిబాబు, ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు, సుభాషిణి, రామచంద్రరావు, వసంతకుమార్‌, వెంకట్రావు, రమణ, ప్రసాద్‌, శ్రీనివాస్‌, తాతారావు, సూర్యనారాయణ, కారెం వెంకటేశ్వరరావు, లక్ష్మణరావు, భాస్కరరావు, పెద్దబ్బులు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు