logo

‘జీవో 1 రద్దు చేయాల్సిందే..’

బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ సారథ్యంలో రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులను కాలరాస్తూ నిరంకుశ వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో 1ను రద్దు చేయాలని తెదేపా నాయకులు డిమాండ్‌ చేశారు.

Published : 27 Jan 2023 05:31 IST

అమలాపురంలో తెదేపా నాయకుల నిరసన

అమలాపురం పట్టణం: బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ సారథ్యంలో రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులను కాలరాస్తూ నిరంకుశ వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో 1ను రద్దు చేయాలని తెదేపా నాయకులు డిమాండ్‌ చేశారు. తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు జీవో 1 రద్దు కోరుతూ అమలాపురం నల్లవంతెన అంబేడ్కర్‌ విగ్రహం వద్ద గురువారం వినతిపత్రం ఉంచారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మెట్ల రమణబాబు మాట్లాడుతూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పాదయాత్రపై పోలీసులు అంక్షలు పెట్టడం దారుణమని, ప్రతిపక్ష పార్టీలను అణగదొక్కే ప్రయత్నాలుచేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు. కార్యక్రమంలో అల్లాడ సోంబాబు, బొర్రా వెంకటేశ్వరరావు, టి.నేతాజీ, కర్రి దత్తుడు, దెందుకూరి సత్తిబాబురాజు, వలవల శివరావు తదితరులు పాల్గొన్నారు.

‘హక్కులు కాలరాస్తున్న వైకాపా’

రాజోలు: వైకాపా ప్రభుత్వం రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తోందని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పేర్కొన్నారు. మండలంలోని తాటిపాక కూడలిలో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అడ్డగోలుగా తీసుకొచ్చిన జీవో నంబరు ఒకటిని రద్దు చేయాలని కోరుతూ జీవో ప్రతులను విగ్రహం వద్ద ఉంచి నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కేతా శ్రీను, ఉప ఎంపీపీ పొలమూరి శ్యాంబాబు, పిల్లి శ్రీరామమూర్తి, గుబ్బల శ్రీనివాస్‌, చాగంటి స్వామి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని