‘రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన’
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన సాగిస్తున్నాయని కేంద్ర మాజీ మంత్రిఎం.ఎం.పళ్లంరాజు అన్నారు.
వివరాలు వెల్లడిస్తున్న పళ్లంరాజు, నాయకులు
కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన సాగిస్తున్నాయని కేంద్ర మాజీ మంత్రి ఎం.ఎం.పళ్లంరాజు అన్నారు. ఈ నెల 26 నుంచి మార్చి 26 వరకు కాకినాడ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్న పాదయాత్రను గురువారం స్థానిక జిల్లా కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఆయన ప్రారంభించారు. ఏఐసీసీ, ఏపీసీసీ పిలుపు మేరకు రాహుల్‌గాంధీ దేశ ఐక్యత కోసం చేసిన భారత్ జోడో యాత్రలో ఇచ్చిన సందేశానికి సంబంధించిన కరపత్రాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై రూపొందించిన కరపత్రాలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో ప్రాణ త్యాగాలు చేసి స్వాతంత్య్ర తెచ్చారని, రాజ్యాంగం రచించుకున్నామని, దీనికి తూట్లు పొడిచే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్నారు. కాకినాడ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో గురువారం నుంచి పాదయాత్ర జరుగుతుందని, దీనిలో ప్రతి ఒక్కరికి రాహుల్‌గాంధీ సందేశం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల కరపత్రాలను అందజేస్తామన్నారు. అనంతరం ఆయన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి కాకినాడ నగరంలో పాదయాత్ర నిర్వహించి, ప్రజలకు కరపత్రాలు అందజేశారు. ముందుగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గాంధీ, అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం స్థానిక ఇంద్రపాలెం లాకుల వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సీహెచ్.పాండురంగారావు, మల్లిపూడి రాంబాబు, ఆకుల వెంకటరమణ, నులకుర్తి వెంకటేశ్వరరావు, దాట్ల గాంధీరాజు, కోలా ప్రసాద్‌వర్మ, ఉమ్మిడి వెంకట్రావు, మారోతి శివగణేశ్, తాళ్లూరి రాజు, జవాద్, పెద్దాడ సుబ్బారాయుడు, వల్లూరి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
‘వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఓటేయం’.. ఎచ్చెర్ల ఎమ్మెల్యేకు తేల్చిచెప్పిన వైకాపా కార్యకర్తలు
-
Ap-top-news News
సీఎం జగన్ కోసం 2 గంటలు వాహనాల మళ్లింపు
-
World News
Belarus: ‘అమెరికా ఒత్తిడివల్లే.. రష్యా అణ్వాయుధాలకు చోటు!’
-
India News
కరెంటు కోతతో కోపోద్రిక్తుడై.. డిప్యూటీ సీఎం ఇంట్లో బాంబు పెట్టానంటూ ఫోన్!
-
Sports News
IPL 2023: ఆర్సీబీ మార్చ్‌లో గేల్ డ్యాన్స్..కోహ్లీ అని అరుస్తూ ప్రేక్షకుల కేరింతలు
-
Movies News
Priyanka Chopra: బాలీవుడ్‌పై ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు.. అందుకే హాలీవుడ్‌కి వెళ్లానంటూ